విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకుండా ఉండి.. రిలీజ్ అయ్యాక సంచలన విజయాల్ని సాధించే సినిమాలు చాలా తక్కువ. కానీ..అలాంటి మేజిక్ ను ప్రదర్శించిన మూవీ సీతారామం. ఓటీటీల కాలంలో సినిమా విడుదలైందా? థియేటర్లో ఆడిందా? వారం.. రెండు వారాలకే థియేటర్ నుంచి బాక్సులు బయటకు వచ్చేసే పరిస్థితి.
అలాంటిది సీతారామం విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. ఈమూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నా.. ఇప్పటికి పలుచోట్ల ఈ సినిమాను థియేటర్లలో ప్రదర్శిస్తున్న వైనం చూస్తే.. ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది.
ఈ సినిమా తెలుగులో సూపర్ హిట్ అయ్యాక.. హిందీలో విడుదల చేయటం.. అక్కడా భారీ సక్సెస్ ను సొంతం చేసుకొని దూసుకెళుతున్న వేళ.. అక్కడ సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ మూవీని సీక్వెల్ చేసే అంశంపై మీడియా ప్రతినిధి ఒకరు చిత్ర హీరో దుల్కర్ సల్మాన్ ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన.. ఫుల్ క్లారిటీ వచ్చేలా ఆసక్తికర రీతిలో సమాధాన్ని ఇచ్చారు.
ఏదైనా సినిమా సూపర్ హిట్ అయ్యాక.. అది ప్రేక్షకుల మదిలో క్లాసిక్ గా నిలిస్తే.. దాన్ని మళ్లీ టచ్ చేయకూడదనే విషయాన్ని తాను నటుడిని కాక ముందే తెలుసుకన్నట్లు చెప్పారు. తామీ కథను బాగా నమ్మామని.. సీతారామం క్లాసిక్ గా నిలుస్తుందని భావించామని.. అనుకున్నట్లే జరిగిందన్నారు. ఈ క్లాసిక్ మూవీకి కొనసాగింపు ఉండదనే అనుకుంటున్నా అని చెప్పారు. అంతేకాదు.. ఈ మూవీ రీమేక్ కూడా ఉండదన్నారు. మొత్తానికి సీక్వెల్ విషయంపై సందేహాలు ఉన్న వారికి దుల్కర్ విషయాన్ని తేల్చేశారని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.