ఎంత కొడితే అంతగా బంగారం మెరిసిపోతూ వుంటుంది.. మలయాళ హీరో దుల్కర్ కూడా అంతే.. కెరీర్ తొలి నాళ్లలో హీరోగా పనికిరాడని, తనకు నటన రాదని, తండ్రి లెగసీని కొనసాగించేంత టాలెంట్ అతనిలో లేదని విమర్శలు ఎదుర్కొన్నాడట. బహుషా ఆ విమర్శలే అతన్ని మిలమిల మెరిసే బంగారంలా మార్చాయోమో అనిపిస్తోంది. అతని సహజమైన నటన, ఎంచుకుంటున్న సినిమాలు, పాత్రలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలా అన్నారని మరీ ఇలా షాకుల మీద షాకులిస్తే ఎలా దుల్కర్? అని ఆయన అభిమానులు అంటున్నారు.
తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి సినిమాల్లోకి ప్రవేశించిన ఈ వెర్సటైల్ యాక్టర్ తండ్రి ని ఏ విషయంలోనూ అనుకరించే ప్రయత్నం చేయకుండా తనదైన ఓన్ స్టైల్ ని అతి తక్కువ కాలంలోనే క్రియేట్ చేసుకోవడమే కాకుండా మలయాళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటుడిగా నూటికి నూరు మార్కుల్ని దక్కించుకుని ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. గత కొంత కాలంగా విభిన్నమైన కథలతో సినిమాలు, సిరీస్ లు చేస్తూ షాకుల మీద షాకులిస్తున్నాడు.
సినిమా సినిమాకు వేరియేషన్ చూపిస్తూ తనదైన పంథాలో మెస్మరైజ్ చేస్తున్నాడు. `కురుప్`తో సంచలనం సృష్టించిన దుల్కర్ ఆ తరువాత తెలుగులో `సీతారామం` వంటి ఎపిక్ లవ్ పీరియాడికల్ ఫిక్షనల్ డ్రామాతో అబ్బురపరిచాడు. తనదైన శైలి నటనతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకోవడమే కాకుండా విమర్శకులని సైతం ఆశ్చర్యపరిచాడు. రీసెంట్ గా హిందీలో `చుప్` అంటూ సైకో పాథ్ థ్రిల్లర్ లో సైకోగా నటించి అవాక్కయ్యేలా చేశాడు.
ఇప్పటి వరకు తను చేసిన ప్రతీ సినిమా హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అవుతూ వచ్చాయి. `చుప్` విడుదలై సర్వత్రా ప్రశంసలు వినిపిస్తున్న వేళ దుల్కర్ మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టాడు. ఇదొక పాన్ ఇండియా మూవీ. అంతే కాకుండా ఈ మూవీని జీ స్టూడియోస్ తో కలిసి దుల్కర్ స్వయంగా నిర్మిస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు `కింగ్ ఆఫ్ కోత` అనే టైటిల్ ని ఖరారు చేశారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ ని దుల్కర్ సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
సుప్రిసిద్ద మలయాళ దర్శకుడు జోషి తనయుడు అభిలాష్ జోషీ ఈ మూవీ ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తను దుల్కర్ కు మంచి స్నేహితుడు కూడా కావడంతో ఈ మూవీని చాలా ప్రత్యేకంగా చూస్తున్నాడు దుల్కర్. ఇక ఇటీవల ఇతర భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న దుల్కర్ చాలా రోజుల గ్యాప్ మలయాళంలో చేస్తున్న సినిమా ఇది. సెప్టెంబర్ లో షూటింగ్ మొదలైన ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాల్ని దుల్కర్ వెల్లడించాడు. ఈ సినిమా చాలా రకాలుగా ని ఇంటికొచ్చింది. కొంత గ్యాప్ తరువాత మళ్లీ మలయాళంలోకి వచ్చాను.
నా ఫ్రెండ్ అభిలాష్ జోషీతో తొలిసారి చేతులు కలుపుతున్నాను. ఇది దర్శకుడిగా అతని తొలి సినిమా. సినిమా బ్రాండింగ్ లో అతనికి పదేళ్లుగా అనుభవం వుంది. మలయాళ ఇండస్ట్రీలో జీ స్టూడియోస్ తో తొలిసారి కలిసి పని చేస్తున్నాం. మేము గట్టిగా నమ్ముతున్న సినిమా ఇది. కథనానికి అనుగుణంగా ఉంటూనే ఉత్తమ థియేట్రికల్ అనుభవాన్ని మీ ముందుకు తీసుకురావడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నాం. తారగణం, సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాల్ని త్వరలో తెలియజేస్తాం` అని వెల్లడించాడు.