దసరా నిలిచేదెవరు? గెలిచేదెవరు?

Update: 2017-07-01 08:10 GMT
ఈసారి దసరా రేస్ మహా రంజుగా మారిపోయింది. గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా సంక్రాంతికి కూడా స్టార్లు పోటీ పడి.. మాంచి ఎంటర్టెయిన్మెంట్ ఇచ్చారు. అవి మినహాయిస్తే.. మరెప్పుడూ పోటీ కనిపించలేదు. కానీ ఈ సారి దసరాకి వచ్చే విషయంలో మాత్రం ముగ్గురు స్టార్ హీరోలు గట్టి పట్టుమీదే ఉన్నారు.

అందరికంటే ముందుగా సెప్టెంబర్ 29న వస్తోందంటూ.. నందమూరి బాలకృష్ణ- పూరీ జగన్నాధ్ ల మూవీ పైసా వసూల్ పై ప్రకటన వచ్చింది. సెప్టెంబర్ 21 న జూనియర్ ఎన్టీఆర్ మూవీ జై లవ కుశను రిలీజ్ చేస్తామంటూ.. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా చెప్పేశాడు. డేట్ చెప్పకపోయినా దసరాకు స్పైడర్ వస్తుందంటూ మహేష్ వీరికంటే ముందే అనౌన్స్ చేశాడు. సెప్టెంబర్ 22.. 27 తేదీల మధ్య వచ్చే ఛాన్సుంది. దసరాకు ఇలా మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అయితే.. థియేటర్లు కళకళలాడడం ఖాయమే కానీ.. ఈ సినిమాలపై పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితే ఆలోచించాలి.

సోలోగా వచ్చి రెండు వారాలు కలెక్షన్స్ ఇరగదీస్తేనే.. సేఫ్ జోన్ లోకి వచ్చే పరిస్థితి. అలాంటిది మూడు సినిమాలు అంటే చాలా క్లిష్టమైన సిట్యుయేషన్. అయితే.. ఈ పరిస్థితిని తప్పించుకోవడానికి జై లవ కుశ రిలీజ్ ను ఒక వారం ప్రీ పోన్ చేసి.. సెప్టెంబర్ 14న కానీ.. 15న కానీ విడుదల చేసే ఆలోచన ఉందని ఒక టాక్ నడుస్తోంది. మరోవైపు మహేష్ బాబు స్పైడర్ మూవీ విషయంలో ఇంకా పాటలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండడంతో.. డిసెంబర్ లో విడుదల చేద్దామని భావిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. బాలయ్య పైసా వసూల్ మాత్రం దసరాకి రావడం పక్కా. మరి ఏం జరగనుందనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News