మ‌గువ‌ల గుండెల్లో మారాజు బ్రావో!

Update: 2019-04-14 14:28 GMT
ప్ర‌తిభ‌తో పాటు వివాదాల్ని మోసుకురావ‌డంలో వెస్టిండియ‌న్ క్రికెట‌ర్ డ్వేన్ బ్రావో త‌ర్వాత‌నే. రోజంతా శ్ర‌మించి సాయంత్రానికి ఏదో ఒక చిలౌట్ లేనిదే నిదుర‌పోని వాడిగా అత‌డికి టీమ్ లో పేరుంది. క్రిస్ గేల్ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి విష‌యం ఉన్న స్టార్ క్రికెట‌ర్ గా బ్రావో కి పాపులారిటీ ఉంది. అత‌గాడి కాస్తంత విలాసాల పురుషుడు అని ర‌క‌ర‌కాల సంద‌ర్భాల్లో భామ‌ల‌తో క‌లిసి దిగిన ఫోటోలు చెబుతున్నాయి. ఈ ఫోటోలు మ‌గువ‌ల‌తో అత‌డి స్నేహాల‌కు సింబాలిక్ అని చెబుతున్నారు కొంద‌రు.

2014 ఇండియా టూర్ స‌మ‌యంలో ఓ వివాదాన్ని త‌ల‌కెత్తుకుని ఏకంగా 2015 ప్ర‌పంచ క‌ప్ నుంచి నిష్కృమించిన బ్రావో.. ఆ త‌ర్వాత తిరిగి టీమ్ లో రీఎంట్రీ ఇచ్చి ఎదిగిన తీరు అసాధార‌ణం. స్టార్ బ్యాట్స్ మ‌న్ గా.. ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం  ఉన్న‌వాడిగా అత‌డికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులున్నారు. మ‌హిళాభిమానుల‌కు కొద‌వేం లేదు. ముఖ్యంగా  బ్రావోకి బాలీవుడ్ స్టార్ల‌తోనూ చ‌క్క‌ని ప‌రిచ‌యాలున్నాయి. ప్ర‌స్తుతం ఐపీఎల్ పుణ్య‌మా అని అత‌డి పాపులారిటీ మ‌రింత‌గా పెరిగింది. ఒంటి చేత్తో మ్యాచ్ తీరుతెన్నుల్ని మ‌లుపు తిప్పే స‌త్తా ఉన్న ఆట‌గాడిగా అత‌డంటే ఇష్ట‌ప‌డే వాళ్లు ఉన్నారు.

అందుకే అత‌డిని 2011లో ఎం.ఎస్.ధోని కెప్టెన్సీలోని చెన్న‌య్ సూప‌ర్ కింగ్స్ టీమ్ ద‌క్కించుకుంది. ఆ టీమ్ కి విజ‌యాలు చేకూర్చ‌డంలో బ్రావో పాత్ర విస్మ‌రించ‌లేనిది. ఇక అత‌డు ప‌లు సంద‌ర్భాల్లో బాలీవుడ్ క‌థానాయిక‌లు ఊర్వ‌శి రౌతేలా, అమైరా ద‌స్తూర్ వంటి భామ‌ల‌తో క‌లిసి పార్టీల‌తో చిలౌట్ చేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఓసారి పార్టీ అనంత‌రం ``చిల్లింగ్ విత్ బ్యూటిఫుల్ అమైరా ద‌స్తూర్ `` అని క్యాప్ష‌న్ తో పాటు అమైరాతో దిగిన ఫోటోని షేర్ చేశాడు గురుడు. మ‌రోసారి బాలీవుడ్ ని క్రికెట్ మీట‌యితే...!! ఊర్వ‌శి రౌతేలా ఫ‌రెవ‌ర్ ఆల్వేస్ నైస్ టు క్యాచ‌ప్!! అంటూ ఈ అమ్మ‌డి అందానికి ఫిదా అయిపోయాడు.

ఇక విదేశాల్లో అత‌డికి గాళ్ ఫ్రెండ్స్ కి కొదవేం లేదు. అత‌డు పాప్ గాయ‌కుడిగానూ పాపుల‌ర్ కాబట్టి అత‌డితో చెట్టా ప‌ట్టాల్ అంటూ తిరిగేసేందుకు ప‌లువురు విదేశీ మోడ‌ల్స్ ఎంతో ఇష్ట‌ప‌డ్డారు. డ్వేన్ బ్రావో ఓసారి హాన్ న‌హోర్వ‌ల్ అనే టాప్ మోడ‌ల్ తో షికారు చేసిన ఫోటోని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశాడు. గ్రేట్ నైట్ ఔట్ విత్ మై హాట్ మోడ‌ల్ ఫ్రెండ్! అంటూ ట్వీట్ చేశాడు. మ‌రో సంద‌ర్భం లో డెక్స్ ట్రో థామ‌స్ అనే సెక్సీ గాళ్ తో క‌రీబియ‌న్ డ్రీమ్స్ అంటూ వీడియోని రివీల్ చేశాడు. ఇలా ప‌రిశీలిస్తే డ్వేన్ బ్రావోలో క‌ళాపోష‌ణ‌కు సంబంధించి చాలా విష‌యాలే తెలిశాయి.


Tags:    

Similar News