టాలీవుడ్ ప్రముఖులకు లింకు ఉందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న డ్రగ్స్ కేసులో ఊహించని ట్విస్టు ఒకటి తాజాగా చోటు చేసుకుంది. కొన్నేళ్ల క్రితం డ్రగ్ కేసు తెర మీదకు వచ్చి సంచలనంగా మారటం.. అప్పట్లో కొంత హడావుడి చోటు చేసుకున్నా.. తర్వాత చప్పుడు కాకుండా ఉండిపోవటం చర్చకు తావిచ్చింది. తాజాగా అనూహ్యంగా డ్రగ్స్ కేసును ఈడీ టేకప్ చేయటం.. పలువురు టాలీవుడ్ ప్రముఖుల్ని వరుస పెట్టి విచారణ చేస్తుండటం తెలిసిందే.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న సినీ నటుడు నందును విచారణ చేయాల్సిన ఈడీ అధికారులు.. అతడ్ని మంగళవారం విచారణకు రావాలని చెప్పటం.. అతను హాజరు కావటం తెలిసిందే. ఏడు గంటల పాటు సాగిన విచారణలో.. ఊహించని ట్విస్టు అతడికి ఎదురయ్యేలా చేసింది ఈడీ. నందూను విచారిస్తున్న కార్యాలయానికే డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్ ను.. నందూ ఎదుట కూర్చోబెట్టి విచారణ చేయటం గమనార్హం.
ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న కెల్విన్ ను మంగళవారం ఈడీ ఆఫీసుకు పిలిచిన అధికారులు.. అతన్ని రాత్రి పది గంటల వరకు విచారిస్తూనే ఉన్నట్లు చెబుతున్నారు. నందూ విచారణలో వివరాలు సేకరించటంతో పాటు.. క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసినట్లుగా చెబుతున్నారు. కెల్విన్ తో నందూకు కొన్ని ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లుగా ఈడీ అనుమానిస్తోంది. తనపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని నందూ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబందించి నందూ తన బ్యాంకు ఖాతాల స్టేట్ మెంట్లను కూడా అధికారుల ముందు ఉంచినట్లుగా చెబుతున్నారు.
నందూకు ముందు విచారణ జరిపిన పూరీ జగన్నాధ్.. ఛార్మీ.. రకుల్ ప్రీత్ సింగ్ సమయంలో ఆఫీసుకు తీసుకురాని కెల్విన్ ను.. తాజాగా తీసుకురావటం.. అతడి ఇంటి నుంచి లాప్ ట్యాప్.. కొన్ని పత్రాలు.. ఫోన్లను తీసుకువచ్చినట్లుగా చెబుతున్నారు. కెల్విన్ ఈవెంట్ మేనేజర్ కావటంతో అతడితో సంప్రదింపులు జరిపానే తప్పించి.. డ్రగ్స్ ఉదంతంలో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈడీ విచారణకు భిన్నంగా నందూ విచారణ జరగటం విశేషం.