`ఈ నగరానికి ఏమైంది` ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. అయితే, ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన యంగ్ హీరోలు స్టేజిపైన నానా రచ్చ చేశారు. స్టేజిపై తెలుగులోనే మాట్లాడాలని హోస్ట్ ప్రియదర్శి కండిషన్ పెట్టడంతో ....వారి సంభాషణ ఫన్నీగా సాగింది. వారు మధ్య మధ్యలో ఇంగ్లిష్ పదాలను వాడడం...వారికి ప్రియదర్శి కౌంటర్ ఇవ్వడంతో ఆ కామెడీ కాన్వర్జేషన్ అందరినీ ఎంటర్ టైన్ చేసింది. తరుణ్ భాస్కర్ సినిమాలో తనకు చాన్స్ వస్తుందని తాను ఊహించలేదని అభినవ్ అన్నాడు. తనకు చాలా ఆనందంగా ఉందని, గత ఆరు నెలల నుంచి ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డామని చెప్పాడు. ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందని అన్నాడు. ఇప్పటికే అభినవ్ యాక్ట్ చేసిన చిత్ర ప్రమోషన్ ప్రోమో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
ఇది పూర్తి ఎంటర్ టైన్ మెంట్ సినిమా అని, ఫ్యామిలీతో అందరూ కలిసి వచ్చి చూడవచ్చని...బూతులుండవని ఈ సినిమాలో నటించిన మరో హీరో సాయి సుశాంత్ అన్నాడు. గోవాలో పార్టీ టైంలో వచ్చిన కొన్ని పదాలను తరుణ్ బీప్ చేశాడని ...కాబట్టి ఇబ్బంది లేదని చెప్పాడు. `వెళ్లిపోమాకే `లో నటించిన తర్వాత మరో సినిమా చాన్స్ కోసం తాను ఎంతగానో ట్రై చేశానని విశ్వక్ సేన్ అన్నాడు. తనకు తెలిసిన వారందరికీ మెసేజ్ లు పెట్టానని, ఎవరూ రెస్పాండ్ అవ్వలేదని చెప్పాడు. కానీ, తాను తన ప్రయత్నాలను ఆపలేదని, అవకాశాల కోసం వెతుకుతూనే ఉన్నానని అన్నాడు. అటువంటి టైంలో తరుణ్ అవకాశం ఇచ్చాడని - మంచి సినిమాలో చేసినందుకు ఆనందంగా ఉందని అన్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ వంటి బ్యానర్ లో మాలాంటి చిన్న హీరోలకు అవకాశం వస్తుందా అనుకునే వాడినని...కానీ, ఈ సినిమాతో ఆ అనుమానం పోయిందని చెప్పాడు. టాలెంట్ ఉండి వెతుక్కుంటే అవకాశాలు తప్పకుండా వస్తాయని - ఊరికే ఇంట్లో కూర్చొని అవకాశాలు రావడం లేదంటే కుదరదని శ్రీరెడ్డి వంటి వారిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేశాడు..ఇంట్లో కూర్చొని .....నానా రచ్చ చేసుకుంటే అవకాశాలు రావని....టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటే ఎవరైనా పిలిచి అవకాశాలిస్తారని....విశ్వక్ లాంటి వారిని చూసి శ్రీరెడ్డి నేర్చుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.