'చెప్పను బ్రదర్' పై చెప్పేసిన డైరెక్టర్

Update: 2016-07-13 06:49 GMT
దర్శకుడు జి ఈశ్వర్ రెడ్డి తన తొలి సినిమా సిద్ధు ఫ్రం శ్రీకాకుళంతోనే మంచి హిట్ సాధించాడు. ఇప్పుడు సెల్ఫీరాజా అంటూ అల్లరి నరేష్ తో మరోసారి కితకితలు పెట్టించనున్నాడు ఈ దర్శకుడు. మొదటి సినిమా తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ వెంటాడగా.. ప్రెస్టీజియస్ గా అనుకున్న ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ శ్రీహరి మరణంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్నాడు ఈశ్వర్ రెడ్డి. అల్లరి నరేష్ తో స్పూఫ్ లు లేకుండా సినిమా తీశానని చెబుతూ ప్రచారం చేస్తున్నాడు.

సెల్ఫీ రాజాలో స్పూఫ్ లు లేవని చెబుతున్నా.. 'చెప్పను బ్రదర్' డైలాగ్ మాత్రం బాగా వాడేసుకున్నాడు. పవన్ గురించి కామెంట్ చేయమన్నపుడు బన్నీ ఇచ్చిన ఆన్సర్ ఇది. ఇప్పటికే ఒకట్రెండు సార్లు దీనిపై తన క్లారిటీ కూడా ఇచ్చినా.. చెప్పను బ్రదర్ అనే వర్డింగ్ మాత్రం బాగా పాపులర్ అయింది. మరి స్పూఫ్ లు లేవన్నపుడు ఇది మాత్రం ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే ప్రశ్న దర్శకుడికి ఎదురైంది. 'అప్పటికే మేం క్లైమాక్స్ షూటింగ్ కూడా పూర్తి చేసేశాం. కానీ ఈ కాంట్రవర్సీ జనాలను ఆకర్షించింది. అందుకే దాని చుట్టూ ఓ సన్నివేశం ఉంచాం' అంటూ వివరించాడు ఈశ్వర్ రెడ్డి.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ అంశాన్ని నెగిటివ్ గా తీసుకుంటారని అనుకోవడం లేదన్న దర్శకుడు.. బన్నీ అభిమానులు పాజిటివ్ గా ఎందుకు రిసీవ్ చేసుకోకూడదు అంటున్నాడు. అల్లరి నరేష్ చాలామంది స్టార్ హీరోలను ఇమిటేట్ చేశాడని అప్పుడెప్పుడు రాని తేడాలు.. ఇప్పుడు వస్తాయని అనుకోవడం లేదంటూ.. చెప్పను బ్రదర్ గురించి చాలానే చెప్పాడు సెల్ఫీ రాజా దర్శకుడు.

Tags:    

Similar News