యంగ్ హీరో నాగ శౌర్య ప్రస్తుతం '@నర్తనశాల' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి ఈ సినిమా ద్వారా టాలీవుడ్లో తన లక్కును పరిక్షించుకోనున్నాడు. నాగశౌర్య హోమ్ బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు '@నర్తనశాల' టీమ్ ఫస్ట్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు మణి శర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. 'ఎగిరెనే మనసు' అంటూ సాగే ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా సమీర భరద్వాజ్, మహతి స్వర సాగర్ పాడడం జరిగింది. ఈ పాట మంచి లవ్ ఫీల్ ఉన్న సాఫ్ట్ మెలోడీ. మొదటి సారి విన్న వెంటనే 'వావ్' అనే ఫీలింగ్ రాదు గానీ స్లోగా ఆకట్టుకుంటుంది. పాట లిరిక్స్ కు - మూడ్ కు తగ్గట్టే సూపర్బ్ మాంటేజ్ షాట్స్ ఉండడం ప్రేక్షకులను తప్పని సరిగా కనెక్ట్ అవుతుంది. నాగ శౌర్య - కాష్మీరల మధ్య వర్కౌట్ అయిన కెమిస్ట్రీ పాటలో ఒక హైలైట్.
ఈ పాటను చూస్తుంటే మనకు 'ఛలో' లోని 'చూసి చూడంగానే' పాట గుర్తు రావడం ఖాయం. అది కూడా ఇలాంటి లవ్ ఫీల్ తో ఉన్న మెలోడీనే అయినా ఆ సాంగ్ ఇన్స్టంట్ గా నచ్చుతుంది. 'ఎగిరేనే మనసు' ను దాంతో మనం పోల్చలేం గానీ ఇది కూడా దాదాపు అందరూ ఆడియన్స్ కు నచ్చే పాటే. '@నర్తనశాల' టీమ్ మాత్రం ' ఛలో' స్ట్రేటజీ ఫాలో అవుతూ మంచి మెలోడి తో ఆడియన్స్ ను క్లీన్ బౌల్డ్ చేయాలని ప్లాన్ చేసినట్టుగా ఉంది. మరి ఇంకెందుకాలస్యం. మీరూ ఓ లుక్కేసి 'ఎగిరేనే మనసు' ఎలా ఉందో చూడండి.