చిరు-రవితేజ సినిమాలో ఎయిటీస్ హీరోయిన్

Update: 2022-07-19 04:28 GMT
'ఎయిటీస్ క్లాస్' సౌతిండియా స్టార్ల సంద‌డి గురించి తెలిసిందే. గెట్ టుగెద‌ర్ పార్టీల పేరుతో ప్ర‌తియేటా ఒక వేదిక‌(వెన్యూ)పై క‌లిసి సంద‌డి చేస్తుంటారు. ఇందులో సుమ‌ల‌త కూడా కీల‌క స‌భ్యురాలు. సుహాసిని మ‌ణిర‌త్నం - రాధిక‌ల‌తో పాటు ఎంతో ప్ర‌భావ‌వంత‌మైన న‌టిగా సుమ‌ల‌త తెలుగు వారికి సుప‌రిచితం.

మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న గ్యాంగ్ లీడ‌ర్ చిత్రంలో సుమ‌ల‌త న‌టించారు. ఇంత‌కుముందు జూబ్లీహిల్స్ లో ని మెగాస్టార్ స్వ‌గృహంలో ఏర్పాటు చేసిన ఎయిటీస్ స్టార్స్ రీయూనియ‌న్ ఈవెంట్ లో సుమ‌ల‌త ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

తాజా స‌మాచారం మేర‌కు సుమ‌ల‌త తెలుగు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నార‌ని తెలిసింది. అందుకు మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ వెల్ కం చెబుతున్నారు. అంతేకాదు.. చిరు- ర‌వితేజ కాంబినేష‌న్ లో రూపొందుతున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ లో ఓ కీల‌క పాత్ర‌కు సుమ‌ల‌త‌ను ఎంపిక చేశార‌ని తెలిసింది.

ఇటీవల సీనియర్ నటి సుమలత కుమారుడు హీరోగా రంగ ప్ర‌వేశం చేస్తున్నార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇంత‌లోనే సుమ‌ల‌త రీఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర అప్ డేట్ అందింది.

మెగాస్టార్ చిరంజీవి- ర‌వితేజ క‌లయిక‌లో బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న వాల్టేర్ వీర‌య్య (వ‌ర్కింగ్ టైటిల్) లో సుమ‌ల‌త‌ రవితేజ తల్లిగా కనిపించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇప్పటికే రవితేజ ఈ సినిమా సెట్స్ లో బిజీగా ఉన్నారు. త్వరలో సుమలత కూడా టీమ్ లో జాయిన‌వుతున్నారు. మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది. సుమ‌ల‌త ప్ర‌ముఖ న‌టుడు అంబ‌రీష్ ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అంబ‌రీష్ 2018లో కీర్తిశేషులు అయ్యారు.
Tags:    

Similar News