ఓటీటీలోకి 'ఏక్ మినీ కథ'.. డిజిటల్ ప్రీమియర్స్ ఎప్పుడంటే..!

Update: 2021-05-20 11:30 GMT
కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో థియేట్రికల్ విడుదలలన్నీ నిరవధికంగా వాయిదా వేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో రిలీజ్ చేయాలని చూసిన చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో ''ఏక్ మినీ కథ'' చిత్రాన్ని కూడా డిజిటల్ రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ''ఏక్ మినీ కథ'' చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నారు. మే 27న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు పేర్కొంటూ అనౌన్స్ మెంట్ పోస్టర్ ని వదిలారు. నిజానికి ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేట్రికల్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేసుకున్నారు. ఇప్పట్లో సాధారణ పరిస్థితులు వచ్చి థియేటర్స్ లోకి తీసుకొచ్చే అవకాశం లేకపోవడంతో మేకర్స్ ఓటీటీ రిలీజ్ కి మొగ్గుచూపారు.

సంతోష్ శోభన్ - కావ్యా థాపర్ హీరోహీరోయిన్లుగా రూపొందిన ''ఏక్ మినీ కథ'' చిత్రంలో శ్రద్ధాదాస్ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చగా.. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందించగా.. సత్య ఎడిటింగ్ చేశారు. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై 'ఏక్ మినీ కథ' సినిమాని నిర్మించారు.
Tags:    

Similar News