'చూసీ చూడంగానే' ఫేమ్ శివ కందుకూరి నటిస్తున్న తాజా చిత్రం ''మను చరిత్ర''. ఇందులో మేఘా ఆకాష్ - ప్రియ వడ్లమాని - ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ పెదగాని దర్శకునిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ సమర్పణలో ప్రొద్దుటూర్ టాకీస్ బ్యానర్ పై నరాల శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాన్సన్ జోసెఫ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా 'ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల' అనే పాట లిరికల్ వీడియోని కాజల్ అగర్వాల్ రిలీజ్ చేసింది.
'ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల.. ఏ సోట ఉంటాదిరో.. ఏ గల్లీలో ఉంటాదిరో ఆ ఇల్లు.. ఏ సందులో ఉంటాదిరో.. ఎవ్వరిని అడగాలిరో అడ్రస్సు.. ఏ దారి నడవాలిరో..' అంటూ సాగిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. మేఘా ఆకాష్ ప్రేమలో పడిన శివ.. ఆమె జాడ తెలుసుకోడానికి సిటీ అంతా గాలిస్తున్న సందర్భంలో ఈ పాట పాడుకుంటున్నాడు. ఫోక్ టచ్ తో ఉన్న ఈ సాంగ్ కు గోపీ సుందర్ బాణీలు సమకూర్చారు. గేయ రచయిత చంద్రబోస్ ఈ గీతానికి సాహిత్యం అందించడమే కానుండా.. ఇందులో కనిపించి సందడి చేశారు. యువ గాయకుడు ధనుంజయ్ ఈ పాటను తనదైన శైలిలో హుషారుగా ఆలపించారు.
'ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల' పాటలో శివ కందుకూరి - మేఘా ఆకాష్ వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. దీనికి భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. రాహుల్ శ్రీవాత్సవ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా 'మను చరిత్ర' చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రంలో సుహాస్ - డాలి ధనంజయ్ - శ్రీకాంత్ అయ్యంగార్ - మధునందన్ - రఘు - దేవీప్రసాద్ - ప్రమోదిని - సంజయ్ స్వరూప్ - హర్షిత - గరిమ - లజ్జ శివ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
Full View