జై బాహుబలి అన్న టి‌వి మహారాణి

Update: 2017-05-30 04:48 GMT
బాహుబలి 2 విడుదలై ఇప్పటికే 1500 కోట్ల కలెక్షన్ల బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. నాట్ ఔట్ గా ఉన్న ప్లేయర్ లా మరింత దీక్షగా మార్కెట్లో చెలరేగిపోతోంది. ఇంకో వారంలో 2000కు కూడా చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇండియాలో ఉన్న నిర్మాతలందరికి ఇది ఒక ఒక ఆశావాద పరిణామం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

టి‌వి నిర్మాత సామ్రాజ్యానికి మహారాణి లాంటి ఏక్తా కపూర్ కూడా ఇప్పుడు బాహుబలి 2 ని పొగడ్తలతో ముంచేసింది. టి‌వి నిర్మాణంలో బిజీగా ఉంటూనే సినిమాలు నిర్మిస్తున్న ఏక్తా తన తాజా హింది సినిమా హాఫ్ గర్ల్ ఫ్రెండ్ విజయంతో మంచి ఖుషీగా ఉంది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద 50 కోట్ల మార్క్ ను దాటింది. ఈ మధ్య ఆవిడ చేసిన సినిమాలు అంతగా విజయం పొందక పోయినా  హాఫ్ గర్ల్ ఫ్రెండ్ తో కాస్త ఊపిరి తీసుకుంది. అదే ఆనందం మీడియాతో పంచుకుంటూ బాహుబలి విజయం తనకు గొప్ప ప్రేరణ ఇచ్చింది అనిచెప్పింది. ''400 కోట్లుతో నిర్మించిన సినిమా 2000 కోట్లు వరకు కలెక్ట్ చేయడం ఇండియా సినిమాకు జరిగిన మహా భాగ్యం'' అంటూ చెప్పుకొచ్చింది. ఈ సినిమా తో రాజమౌళి ప్రతిభ ప్రపంచ నాలుదిశలు వ్యాప్తి చెందింది అంటోంది.

తన బాలాజీ ప్రొడక్షన్ కంపెనీలో ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా నిర్మించడం మొదలు పెట్టింది. టి‌వి రంగంలో విజయబావుటా ఎగరవేసినా కూడా.. సినిమాల్లో అంతగా రాణించలేక పోయింది ఏక్తా. అందుకే బాహుబలి విజయం బాగా ప్రేరణ ఇచ్చినట్లు ఉంది ఈ రాణికి. మరి తరువాత ఎలాంటి కథతో తను వెండితెరను షేక్ చేస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News