వీడియో : 'కృష్ణమ్మ' ఏమవుతుందో మనలో...

Update: 2022-08-19 07:02 GMT
విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న సత్యదేవ్ ఇటీవలే గాడ్సే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. కమర్షియల్ గా ఆ సినిమా అంతగా సక్సెస్‌ అవ్వకున్నా కూడా సత్యదేవ్ కు మంచి పేరు ను తీసుకు వచ్చింది. సత్యదేవ్ మరో విభిన్నమైన సినిమా కృష్ణమ్మ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.

వివి గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందిన కృష్ణమ్మ సినిమా ఫస్ట్‌ లుక్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఫస్ట్‌ లుక్ కి మంచి రెస్పాన్స్ దక్కింది.

తాజాగా విడుదల అయిన టీజర్ కూడా యూత్‌ ఆడియన్స్‌ తో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉందంటూ కామెంట్స్ వచ్చాయి. తాజాగా ఈ సినిమా నుండి మొదటి పాటను కూడా విడుదల చేశారు.

ఏమవుతుందో మనలో... అంటూ సాగే పాటను ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్ చేతుల మీదుగా విడుదల చేయించారు. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యం ను అందించగా కాలభైరవ సంగీతాన్ని అందించాడు.

ఈమధ్య కాలంలో యూత్ లో తెగ సందడి చేస్తున్న సిద్ శ్రీరామ్‌ ఈ పాటను పాడటంతో ప్రత్యేకంగా నిలుస్తుందంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

పాట మెలోడీ ట్యూన్ తో సాగుతూ క్లాస్ మరియు మాస్ ఆడియన్స్ ను మెప్పిస్తోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ పాటలు ఉంటాయంటూ యూనిట్‌ సభ్యులు చెప్పినట్లుగానే ఈ పాట బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీ పై క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా తో సత్యదేవ్ మరో విజయాన్ని సొంతం చేసుకుంటాడనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు.


Full View

Tags:    

Similar News