ఏమో ఏమో మెరుపుతీగ ఎదురై నవ్విందేమో ఏమో ఏమో వెలుగువాగు నాలో పొంగిందేమో..
ఉందో లేదో ఏమో కాలికింద నేలో కరిగిందేమో.. మాయో మహిమో ఏమో నేల కాస్త నింగై మెరిసిందేమో..
ప్రేమలో ఉండేవారికి జరిగేవన్నీ డాక్టర్ దాస్ కి జరుగుతున్నాయి.. ఇక సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఆ అనుభూతిని అందమైన పదాల్లో ఇలా ఏర్చి కూర్చి మణి శర్మకు అందిస్తే అయన ఒక మెలోడీని ట్యూన్ చేశాడు. ఇలాంటి పాటలు పాడడంతో తనకే తానొక బెంచ్ మార్క్ సెట్ చేసుకున్న సిడ్ శ్రీరాం హస్కీ వాయిస్ లో ఈ గానాన్ని ఆలపించడంతో ఇదొక స్పెషల్ సాంగ్ అయింది.
సూపర్ అనగానే అందరికీ వెంటనే నచ్చుతుంది అని కాదు. మెలోడీస్ ని ఇష్టపడేవారికి మాత్రం వెంటనే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే స్లో గా ఉండడంతో పాటుగా చాలా క్లాసీగా ఉంది పాట. నాకు ఘాటు తీన్ మార్ బీటు.. దానికి తగ్గట్టు "ఆరారా నాకుముక్క నాకుముక్క నాకు ముక్క.." అంటూ తాట పెరికే స్టెప్స్ ఉంటె కానీ కిక్ ఉండదని అనేవాళ్ళకు మాత్రం కాస్త కష్టమే. తప్పు లేదు.. ఎవరి టేస్ట్ వాళ్ళది!
ఇక లిరికల్ సాంగ్ లో ఉండే విజువల్స్ లో రష్మిక చలాకీగా ఉండడం.. నాని ఆమెను ఆరాధనగా చూడడం బాగుంది. ఇలాంటి పిక్చరైజేషన్ కనుక తోడైతే నాని కెరీర్లో మరో మరాపురాని మెలోడీగా నిలిచిపోతుంది. మణి శర్మ ను ఎందుకు స్వర బ్రహ్మ.. మెలోడీ బ్రహ్మ అంటారో ఈ పాట మరోసారి ప్రూవ్ చేసింది. త్వరగా చూడండి లేకపోతే.. ఏమో ఏమో మీ నెట్ స్లో అవుతుందేమో.. మీకు వీడియో లోడింగ్ సింబల్ కనిపిస్తుందేమో..!
Full View