అడివి శేష్ కథానాయకుడిగా నటించిన సినిమా `ఎవరు`. రెజీన కథానాయిక. వెంకట్ రాంజీ దర్శకుడు. పివిపి నిర్మించారు. ఈ ఆగస్టు 15న థియేటర్లలోకి వస్తోంది ఈ క్రైమ్ థ్రిల్లర్. గూఢచారి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేష్ నటించిన ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆకట్టుకుంది. మరో పదిహేను రోజుల్లో రిలీజ్ ఉంది కాబట్టి ఇప్పటికే ప్రమోషన్ పరంగా వేగం పెంచేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.
తాజాగా `ఎవరు` నుంచి ఓ మెలోడీ సాంగ్ రిలీజైంది. ``ఎన్నెన్నో కథలే చూసినా..ఏవేవో కలలే రేగెనా..`` అంటూ సాగే ఈ మాంటేజ్ పాట కథను డ్రైవ్ చేసేదిగా కనిపిస్తోంది. శ్రీచరణ్ సంగీతం.. చిన్మయి శ్రీపాద గానం మైమరిపిస్తున్నాయి. ఇన్వెస్టిగేషన్ పోలీస్ అధికారిగా హీరో గమనాన్ని.. సమస్యలో ఇరుక్కున్న కథానాయిక గమనాన్ని ఈ లిరిక్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు.
ఇక ఈ సినిమాని `ది ఇన్విజబుల్ గెస్ట్` అనే స్పానిష్ మూవీ థీమ్ ని తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మలిచారన్న ప్రచారం ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్.. క్లైమాక్స్ లో మెరుపులు ఆకట్టుకుంటాయిట. బాలీవుడ్ లో బద్లాకి అదే సినిమా స్ఫూర్తి కావడంతో `ఎవరు` చిత్రంలో అంతకుమించి కొత్తగా ఏం చూపిస్తున్నారు? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. అన్ని సందేహాలకు చెక్ పెట్టే సమాధానం ఆగస్టు 15న సిద్ధంగా ఉంటుందన్నమాట. అదే రోజు శర్వానంద్ నటించిన రణరంగం రిలీజవుతోంది.
Full View