మొదటి నుంచి కూడా నాని విభిన్నమైన కథలకు .. పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. తన పాత్రకి తగినట్టుగా మారిపోవడం .. సన్నివేశాలకు సహజత్వాన్ని ఆపాదించడం ఆయనకి అలవాటు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోవడం వల్లనే ఆయనను ప్రేక్షకులు తన కుటుంబ సభ్యుడి మాదిరిగా భావిస్తూ ఉంటారు.
అలాంటి నాని తన తాజా చిత్రంగా 'అంటే .. సుందరానికీ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా, వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు.
ఈ నెల 10వ తేదీన విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా యూఎస్ లో భారీ వసూళ్లను రాబడుతున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. "హీరో హీరోయిన్ల పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో .. ఒకరిని గురించి ఒకరు ఆలోచన చేస్తూ ఆ ఊహల్లో తేలిపోతున్న సందర్భంలో తెరపైకి వచ్చే పాట ఇది. 'ఎంతచిత్రం ఎన్నేసి జ్ఞాపకాలో ఊపిరాడేదెలా .. ఎంతమాత్రం ఊహాలోలేని ఉత్సవాలలో మునిగితేలా' అంటూ ఈ పాట సాగుతుంది.
కొన్ని ఆలోచనలు .. ఆనందాలు .. అనుభూతులు .. సంతోషాలు .. సందళ్లకి సంబంధించిన విజువల్స్ పై ఈ పాట నడుస్తుంది. తన పట్ల హీరోయిన్ కి గల ప్రేమను గురించీ .. చిన్నప్పటి నుంచి తనకి ఆమె మనసులో గల స్థానం గురించి హీరో తెలుసుకునేది .. చిన్నప్పుడు తనకి ఇష్టమైన గ్రీటింగ్ కార్డు పంపించింది హీరోనే అనే విషయం హీరోయిన్ తెలుసుకునేది కూడా ఈ పాటలోనే.
ఇలా ఒకరినొకరు అర్థం చేసుకుని .. ఆరాధన పెంచుకుని వాళ్లిద్దరినీ మరింత దగ్గర చేసే పాట ఇది. వారి ప్రేమను పెళ్లి వరకూ నడిపించడానికి అవసరమైన బలాన్నిచ్చే పాట ఇది.
వివేక్ సాగర్ ఈ పాటను స్వరపరిచిన తీరు బాగుంది. హీరో హీరోయిన్ల ఆనందాలు .. వాళ్ల ఫ్యామిలీ విషయాలు సాంగ్ లోకి వచ్చి కలుస్తుంటాయి. అన్నీ మంచి శకునములే అనే తరహాలో ఈ పాట సాగుతుంది. నిజానికీ ఈ సినిమాలో డ్యూయెట్లు ఉండవు. ఆ లోటును భర్తీ చేసేదిగా ఈ పాట నడుస్తుంది. సందర్భానికి తగిన పాట .. చాలాసేపు సాగే కథను సింపుల్ గా చెప్పేసే పాటగా ఇది కనిపిస్తుంది. సినిమా చూడకపోయినా .. చాలావరకూ కాన్సెప్ట్ అర్థమయ్యేలా చేయడం ఈ పాటలోని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
Full View