'ఎంత సక్కగుందిరో' పాటతో 'బంగార్రాజు' సంక్రాంతి సెలబ్రేషన్స్..!

Update: 2022-01-14 07:57 GMT
కింగ్ అక్కినేని నాగార్జున - యువసామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ ''బంగార్రాజు''. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'సోగ్గాడు మళ్ళీ వచ్చాడు' అనేది ట్యాగ్ లైన్ తో ఈ సంక్రాంతికి ఇద్దరు బంగార్రాజులు సందడి చేయడానికి థియేటర్లలోకి వచ్చారు.

ఇప్పటికే 'బంగార్రాజు' సినిమాకు సంబంధించిన టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ‘ఎంత సక్కగుందిరో’ అనే మరో పాట లిరికల్ వీడియోని వదిలారు. నాగార్జున పాడిన 'లడ్డుండ' పాటకు నాగచైతన్య వెర్షన్ గా ఉన్న ఈ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది

'రంగు రంగులు ఎగిసి నింగి తాకే సంబరం.. ఊరూ ఊరంత మెరిసే అంగరంగ వైభవం..' అంటూ సాగిన ఈ పాటకు అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూర్చారు. బాలాజీ సాహిత్యం అందించగా.. సాయి మాధవ్ - మోహన భోగరాజు - మేఘన - కావ్య - అపర్ణ కలిసి ఆలపించారు.

కలర్ ఫుల్ గా సంక్రాంతి పండగను గుర్తు చేస్తూ సాగిన ఈ పాటలో నాగచైతన్యతో పాటుగా జాంబీ రెడ్డి ఫేమ్ దక్ష నగర్కార్ ఆడిపాడింది. అమ్మడి అందాలను చిన బంగార్రాజు పొగడడం.. దానికి ఆమె వయ్యారాలు పోతూ సిగ్గుపడడం వంటివి 'ఎంత సక్కగుందిరో' పాటలో చూడొచ్చు.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో చైతూ - దక్ష వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట 'బంగార్రాజు' చిత్రంలో ప్రత్యేకంగా నిలుస్తుందని తెలుస్తోంది. యువరాజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. విజయ్ వర్ధన్ ఎడిటింగ్ వర్క్ చేశారు.

'బంగార్రాజు' చిత్రాన్ని బ్లాక్ బస్టర్ 'సోగ్గాడే చిన్ని నాయన' కు సీక్వెల్ గా తెరకెక్కించారు. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ - నాగచైతన్య కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించారు. సోషల్ ఫాంటసీ అంశాలతో కూడిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పండుగాలాంటి సినిమా మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ సినిమా సంక్రాంతికి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.









Full View





Tags:    

Similar News