ఆది సాయికుమార్ హీరోగా నటించిన గాలిపటం చిత్రంలో నటించిన ఉత్తరాది ముద్దుగుమ్మ ఎరికా ఫెర్నాండెజ్ ప్రస్తుతం బుల్లి తెరపై సందడి చేస్తోంది. టీవీ షోలతో ఈ అమ్మడు బుల్లి తెర ప్రేక్షకులకు చేరువ అయ్యింది. ఈ సమయంలోనే ఈ అమ్మడు సమతాన్ ఇంకా షాకీర్ షేక్ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. వారిద్దరితో ప్రేమ విషయం గురించి గతంలో పలు సార్లు స్పందించి కొట్టి పారేసినా కూడా మీడియాలో మాత్రం ప్రచారం జరుగుతూనే ఉంది. దాంతో తాజాగా ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ఆసక్తికర విషయాన్ని వెళ్లడి చేసింది.
ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్న మాట నిజమే. ప్రస్తుతం చాలా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నాను. కాని నేను ప్రేమలో ఉన్నది మీడియాలో ప్రచారం జరుగుతున్న వ్యక్తులతో కాదు. నేను ఎవరితో రిలేషన్ లో ఉన్నానో అతడికి సినిమా పరిశ్రమ ఇంకా టీవీ పరిశ్రమలతో సంబంధం లేదు. గత మూడు సంవత్సరాలుగా మేము ఇద్దరం రిలేషన్ లో ఉన్నాం.
నాతోటి నటులు నా వల్ల ఎప్పుడు ఇబ్బంది పడకూడదు వారి వ్యక్తిగత జీవితాలపై ప్రభావం పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు చెబుతున్నట్లుగా ఆమె ప్రకటించింది. తాను కెమెరా ముందు ఇతరులతో రొమాంటిక్ సీన్స్ చేయడం.. క్లోజ్ గా ఉండటం ఆయనకు ఇష్టం ఉండదు. అయినా కూడా నా ప్రొఫెషన్ ను గౌరవించి మా స్నేహం మరియు ప్రేమపై నమ్మకంతో ఆతను నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడంటూ తన ప్రియుడు గురించి చెబుతూ మురిసి పోయింది.