భిన్నమైన కథనాలతో సినిమాలు తీసే అగ్రహీరోల్లో ప్రిన్స్ మహేశ్ బాబు ఒకరు. తాను చేసే ప్రతి సినిమాను.. తన గత చిత్రానికంటే విభిన్నంగా ఉండేలా ఆయన జాగ్రత్తలు తీసుకోవటం తెలిసిందే. ప్రిన్స్ కెరీర్ లో ఒక్కడు ఒకలాంటి ఇమేజ్ తీసుకొస్తే.. పోకిరి మరోలాంటి ఇమేజ్ తీసుకొచ్చింది. వీటన్నింటికి మించిన ఇమేజ్ శ్రీమంతుడు తెచ్చి పెట్టింది.
ప్రిన్స్ ను అభిమానించే వారే కాదు.. మిగిలిన వారిని సైతం శ్రీమంతుడు సినిమా పిచ్చపిచ్చగా ఆకట్టుకుంది. శ్రీమంతుడి సినిమాతో మహేశ్ గ్రాఫ్ అందనంత దూరానికి వెళ్లిపోయింది. తాను నిర్మాతగా వ్యవహరిస్తూ యంబి ఎంటర్ టైన్ మెంట్ పేరిట ఒక బ్యానర్ స్టార్ట్ చేయటం శ్రీమంతుడితో షురూ అయ్యింది. తాజాగా బ్రహ్మోత్సవం సినిమాకూ మహేశ్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. మహేశ్ తో ప్రముఖ చిత్ర నిర్మాణ.. పంపిణీ సంస్థ ఈరోస్ ఒక భారీ డీల్ కుదుర్చుకున్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్ లో భారీ చిత్రాల్ని ప్రొడ్యూస్ చేస్తూ దూసుకెళుతున్న ఈరోస్.. టాలీవుడ్ లోనూ నిర్మాణం స్టార్ట్ చేసింది. డిక్టేటర్ తో టాలీవుడ్ లో చిత్ర నిర్మాణాన్ని మొదలు పెట్టిన ఈరోస్ తో మహేశ్ కు అనుబంధం ఎక్కువే.
ఎందుకంటే.. గతంలో ఆయన నటించిన ‘‘1’’.. ‘‘ఆగడు’’.. ‘‘శ్రీమంతుడు’’ చిత్రాలకు ఈరోస్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మహేశ్ నటించే చిత్రాలకు సంబంధించి రూ.300 కోట్ల విలువైన డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే..ఈ డీల్ పూర్తి వివరాలు బయటకు రానప్పటికీ.. టాలీవుడ్ కు సంబంధించి ఇదో భారీ డీల్ గా పరిశ్రమ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. దీనికి సంబంధించి మహేశ్.. ఈరోస్ సంస్థ సీఈవో మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. రూ.300కోట్లుగా చెబుతున్న ఈ డీల్ ఏమిటన్న విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మహేశ్ నటించిన చిత్రాలకు పంపిణీ హక్కులు ఈరోస్ సొంతం అవుతాయన్నది ఒక వాదన అయితే.. మహేశ్ తన సొంత బ్యానర్ మీద నిర్మించిన చిత్రాల్ని ఈరోస్ పంపిణీ హక్కుల్ని తీసుకుంటుందన్నది మరో వాదన. మరి.. ఈ రెండింటిలో ఏది నిజమన్న అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.