దస్ కా దమ్ అంటున్న బాహుబలి రైటర్!

Update: 2018-07-26 16:29 GMT
 సక్సెస్ అనేది మన రేంజ్ ను  ఎలా మారుస్తుందో ఒక్కోసారి మనం కూడా ఊహించలేం.  ఒకసారి సక్సెస్ వచ్చాక అది మన చేతిలోనే ఉండదు.  మరి బాహుబలి లాంటి సినిమాకు స్టొరీ అందించిన రైటర్ KV విజయేంద్ర ప్రసాద్ సంగతేంటి? ఇప్పటికే అయన చుట్టూ చాలామంది ప్రొడ్యూసర్స్ తిరుగుతున్నారు.  తమిళంలో విజయ్ సూపర్ హిట్ సినిమా 'అదిరింది' కి కథ అందించింది కూడా మన విజయేంద్ర ప్రసాదే. 

ఆ సినిమా కాకుండా హిందీలో తెరకెక్కుతున్న 'మణికర్ణిక' సినిమాకు కుడా స్క్రిప్ట్ అందించింది ఆయనే. క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 26 న రిలీజ్ కానుంది. అంతలోపు విజయేంద్ర ప్రసాద్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.   బాలీవుడ్లో లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ అయిన ఈరోస్ ఇంటర్నేషనల్ విజయేంద్ర ప్రసాద్ తో ఒక 10 సినిమాల డీల్ కు సైన్ చేసిందని సమాచారం.  ఈ పది సినిమాల్లో హిందీ, తెలుగు, తమిళ చిత్రాలు ఉంటాయట.  ఈ డీల్ కు విజయేంద్ర ప్రసాద్ కు ఈరోస్ భారీ మొత్తం చెల్లిస్తున్నట్టు సమాచారం.

ఈ ఒప్పందంలో భాగంగా మొదటి సినిమాగా వరుణ్ ధావన్ సినిమాకు కథ అందిస్తున్నాడట మన బాహుబలి రైటర్.  మరి ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనుకున్నారు? 'రంగస్థలం' తో బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపిన సుకుమార్.    
Tags:    

Similar News