మహేష్ తో 300 కోట్ల డీల్?

Update: 2015-09-04 05:00 GMT
బాలీవుడ్ నిర్మాణ సంస్థలు అక్కడి హీరోలతో భారీ డీల్స్ చేసుకోవడం కొత్తేమీ కాదు. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి హీరోలు ఇలాంటి బడా డీల్స్ చేసుకున్న వాళ్లే. యశ్ రాజ్ సంస్థ మీడియం, చిన్న రేంజి హీరో హీరోయిన్లతో ఇలాంటి డీల్సే చేసుకుంటూ ఉంటుంది. ఐతే సౌత్ లో ఇప్పటిదాకా ఈ సంస్కృతి లేదు. ఐతే తొలిసారి మహేష్ బాబు ఇలాంటి భారీ డీల్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం. వరుసగా మహేష్ నటించిన 1 నేనొక్కడినే, ఆగడు, శ్రీమంతుడు సినిమాల్ని హోల్ సేల్ గా కొని డిస్ట్రిబ్యూట్ చేసిన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఓ కళ్లు చెదిరే డీల్ తో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల దాకా ఉండొచ్చన్నది టాలీవుడ్ ను విస్మయపరుస్తున్న సమాచారం.

ఐతే ఈ డీల్ ఎన్ని సినిమాలకు, ఎన్నేళ్లకు అన్నది ఇంకా తెలియట్లేదు. ఐతే మహేష్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలిసిన ఈరోస్ వాళ్లు.. అతడితో వరుసగా సినిమాలు నిర్మించడానికి ఈ డీల్ సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మహేష్ ను బాలీవుడ్ లోకి ఇంట్రడ్యూస్ చేసే ప్రణాళిక కూడా ఇందులో ఉన్నట్లు చెబుతున్నారు. 1 నేనొక్కడినే, ఆగడు సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ మహేష్ మీద ఈరోస్ భరోసా ఉంచింది. వారి నమ్మకం ఫలించి ‘శ్రీమంతుడు’తో భారీగా లాభాలు మూటగట్టుకుంది. మహేష్ మార్కెట్ ను సరిగా వాడుకుని.. సరైన సినిమా తీస్తే దాని రేంజే వేరుగా ఉంటుందని ఈరోస్ వాళ్లకు బాగా అర్థమైంది. అందుకే సౌత్ లో మంచి పొటెన్షియాలిటీ ఉన్న హీరోను లాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ డీల్ పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశముంది.
Tags:    

Similar News