ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాల విషయంలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఒకవేళ సినిమా రిలీజయ్యాక రిజల్టు తేడా వచ్చేసింది అనుకోండి.. మా డబ్బులు మాకిచ్చేయండి అంటూ పంపిణీదారులందరూ గళమెత్తుతున్నారు. భారీగానే గోల చేస్తున్నారు. వారి వాదనలోనూ సగం నిజముంది అనే అనుకోవాలి. అయితే వ్యాపారం అన్నప్పుడు లాస్ వస్తే మాత్రం.. ఇలా డబ్బులు తిరిగి ఇచ్చేయమనడం సమంజసం కాదని ఎన్నోసార్లు నిర్మాతలు కూడా వాపోయారు.
ఈ డిస్కషన్లన్నీ ఎలా ఉన్నా కూడా.. ఈరోస్ ఇంటర్నేషనల్ వారు మాత్రం.. ''సర్దార్'' విషయంలో 'నో రిఫండ్' అనే క్లాజుతో ఎగ్రిమెంట్లు చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా రిలీజయ్యాక రిజల్టు ఎలా ఉన్నా కూడా.. ఒకవేళ లాస్ వస్తే మాత్రం రిఫండ్ అనేది తిరిగి అడగకూడదు అనేది వీరి కండీషన్ అట. ఆ కండీషన్ తోనే అన్ని ఏరియాల్లో సర్దార్ సినిమాను అమ్మేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సర్లేండి.. ఎలాగో పవన్ కళ్యాణ్ సినిమానే కాబట్టి.. మినిమం ఎంటర్ టెయన్ మెంట్ ఉన్నా కూడా.. సినిమా ఖచ్చితంగా ఇన్వెస్టుమెంటును తిరిగి తెచ్చేస్తుందని అందరి నమ్మకం.
ఏప్రియల్ 8న సర్దార్ గ్రాండ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.