ఈమధ్య దాదాపు న్యూడ్ గా ఫొటోలు దిగి చూపరుల గుండెల్లో సెగలు పుట్టించిన సుందరాంగి ఈషా గుప్తా. సోషల్ మీడియాలో ఈ భామ అప్ లోడ్ చేసిన ఫొటోలు చూసి మతులు పోగొట్టుకున్న వాళ్లే కాదు.. ఆమెపై మాటలతో ఎదురుదాడి మొదలెట్టేసిన వారూ ఉన్నారు. కొందరైతే శృతి మంచి వల్గర్ కామెంట్స్ కూడా పెట్టేస్తున్నారు.
తనపై విమర్శలు చేసే వారిపట్ల ఈషా గుప్తా గట్టిగానే రియాక్ట్ అవుతోంది. మన దేశంలో తెల్లగా కనిపించే హీరోయిన్లకు ఆదరణ ఎక్కువ. ఈషా కాస్తంత చామన ఛాయలో కనిపిస్తుంది. దీంతో నెటిజన్లలో కొందరు ఆమెను కాళీ అంటూ కామెంట్ చేయడం మొదలెట్టారు. దీనిపై ఈషా తెగ ఫైరయి పోతోంది. ‘ఈ దేశంలో నూటికి తొంభై మంది ఆడవాళ్లు నా రంగులోనే ఉంటారు. వాళ్ల స్కిన్ టోన్ నాలాగే ఉంటుంది. యూరప్ లో బ్రౌన్ స్కిన్ ఉన్న వాళ్లను అబ్బురంగా చూస్తారు. ఇండియాలో ఆ రంగులో ఉన్నవారిని పట్టించుకోరు సరికదా ఎగతాళి చేస్తారు. నేనిలా ఉన్నందుకు గర్వపడతాను. నన్ను వెక్కిరించాలి అనుకునే వారిదంతా హిపోక్రసీ తప్ప ఇంకేం కాదు’ అంటూ ఈషా గుప్తా తమ మనసులో ఉన్న ఆవేదనను బయటపెట్టింది.
‘ఓ అమ్మాయి రంగును బట్టో.. ఆమె వేసుకున్న దుస్తులను బట్టో ఆమె ఎలాంటిదో ఎలా డిసైడ్ చేస్తారు. నేను సల్వార్ కమీజ్ లో కనిపించినప్పుడు గౌరవనీయంగా చూస్తారు.. అదే షార్ట్ స్కర్ట్ వేసుకుంటే వాళ్ల ఒపినీయన్స్ మారిపోతాయి. వస్త్రధారణ కు ఇచ్చే విలువ అమ్మాయి వ్యక్తిత్వానికి ఇవ్వలేరా’ అంటూ ఈషా గుప్తా ప్రశ్నిస్తోంది. ఈ మాటలు వింటుంటే ఆ మధ్య ఓ సినిమాలో ‘జీన్స్ వేసుకున్న వాళ్లలో మంచివాళ్లూ ఉంటారు.. చీర కట్టుకున్న వాళ్లలో చెడ్డవాళ్లూ ఉంటారు’ అనే డైలాగ్ గుర్తుకు రావడం లేదూ...