ఫోటో స్టోరీ : దృశ్యం పాప అందాల దాడి..!

Update: 2023-01-19 07:53 GMT
9 ఏళ్ల క్రితం వచ్చిన వెంకటేష్ దృశ్యం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మళయాళ పాప ఎస్తేర్ అనీల్ 2021లో వచ్చిన దృశ్యం 2 లో కూడా నటించింది.

అయితే దృశ్యం వచ్చి 9 ఏళ్లు అవుతుండగా ఆ సినిమాలో చిన్న పాపగా అనిపించిన ఎస్తేర్ అనీల్ ఇప్పుడు పెద్ద అమ్మాయి అయ్యింది. ప్రస్తుతం ఈ 21 ఏళ్ల కుమారి చైల్డ్ ఆర్టిస్ట్ గా కాదు ఇక మీద హీరోయిన్ గా చేయాలని ఫిక్స్ అయ్యింది. అందుకే తన మార్క్ గ్లామర్ షోతో అలరిస్తుంది.

17, 18 ఏళ్లకే హీరోయిన్స్ అవుతున్న ఈ టైం లో 21 ఏళ్ల ఎస్తెర్ తనకు ఏం తక్కువ కాదని రెచ్చిపోతుంది. అంతకుముందే హాట్ ఫోటో షూట్స్ తో అదరగొట్టిన ఎస్తేర్ అనీల్ లేటెస్ట్ గా రెడ్ కలర్ డ్రెస్ లో పరువాల వల వేస్తుంది.

గ్లామర్ ఫీల్డ్ లో నెగ్గుకు రావాలంటే స్కిన్ షో కంపల్సరీ ఆ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ లో ఉంది ఎస్తెర్ అనీల్. అయితే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆమెని చూసి ఇష్టపడిన కొందరికి ఆమె ఇలా ఎక్స్ పోజ్ చేస్తుంటే నచ్చట్లేదు. కానీ ఆడియన్స్ మాత్రం ఎస్తెర్ గ్లామర్ ట్రీట్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

తమ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లో హీరోయిన్స్ గ్లామర్ షోతో రెచ్చిపోవడం చాలా కామన్ అయ్యింది. సినిమా ఛాన్స్ లు ఎలా ఉన్నా ఫోటో షూట్స్ విషయంలో చితక్కొట్టేస్తున్నారు. అందుకే వారికి ఏమాత్రం తగ్గకుండా ఎస్తేర్ అనీల్ కూడా గ్లామర్ షో చేస్తుంది. ముఖ్యంగా తన అందాల విందుతో కుర్రాళ్లని డిస్టర్బ్ చేయాలని ఫిక్స్ అయ్యింది అమ్మడు.

తెలుగులో ఒక మంచి అవకాశం కోసం చూస్తున్న ఎస్తెర్ ఈసారి హీరోయిన్ గా చేయాలని ఫిక్స్ అయ్యింది. మరి హీరోయిన్ గా ఎస్తేర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది. కథానాయికగా అమ్మడు ఏ రేంజ్ లో మెప్పిస్తుంది అన్నది చూడాలి. 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News