సూర్య హీరోగా దర్శకుడు పాండిరాజ్ 'ఎతరుక్కుమ్ తునింధవన్' అనే సినిమాను రూపొందించాడు. సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. సూర్య సరసన నాయికగా ప్రియాంక మోహన్ అలరించనుంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ - దసపల్లా హోటల్లో నిర్వహించారు. రానా .. బోయపాటి .. దిల్ రాజు .. గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
గోపీచంచంద్ మలినేని మాట్లాడుతూ .. "సూర్యగారు గజిని .. జై భీమ్ వంటి ఎన్నో మంచి సినిమాలు చేస్తూ వచ్చారు. తెలుగువారి ప్రతి ఇంటిలోను సూర్యగారు ఉన్నారు. మనసు బాగా ఉంటే మనిషి అందంగా ఉంటారు అంటారు. దానికి సూర్యగారు కరెక్ట్ ఉదాహరణ. సూర్యగారికి సంబంధించిన ఒక సంఘటనను నేను మీకు చెబుతున్నాను. అది ఆయనకి గుర్తుండే అవకాశం లేదు. అప్పటికి నేను ఇంకా డైరెక్టర్ ను కాలేదు. కానీ ఆయన 'గజినీ' సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఎక్కడ చూసినా కుర్రాళ్లంతా ఆయన పేరునే కలవరిస్తున్నారు.
కారైకూడిలో 'సింగం' షూటింగ్ జరుగుతూ ఉండగా, మా సినిమాలో హీరోయిన్ గా చేస్తారేమో కనుక్కుందామని నేను అనుష్క గారి కోసం అక్కడికి వచ్చాను. నేను వెళ్లే సమయానికి థియేటర్ బయట అనుష్క చున్నీ సీన్ తీస్తున్నారు. నన్ను పరిచయం చేస్తే నాతో ఓ 10 నిమిషాలు ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. ఆ రోజున నేను నథింగ్ .. కానీ నాకు ఆయన ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆయన మంచి మనసు నేను ఆ రోజున చూశాను. అంత మంచి మనసు ఉంది కనుకనే తెలుగువారి గుండెల్లో ఆయన నిలిచిపోయారు.
సూర్య గారు చేసిన సినిమాల్లో 'సింగం' సినిమాకి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఇప్పుడు ఆయన 'ఈటి' .. 'ఎవరికీ తలవంచడు' సినిమాను చేశారు. ట్రైలర్ చూస్తేనే సినిమా మామూలుగా ఉండదనే విషయం అర్థమవుతోంది. సూర్యగారు మాస్ ఫిల్మ్ చేస్తే అది షేక్ చేయడం ఖాయం. రత్నవేలు గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. పాండిరాజ్ గారి సినిమాలను నేను ఎక్కువగా లైక్ చేస్తుంటాను. ఆయన కథల్లో మట్టి వాసనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.