ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుకు కొన్ని విషయాల్లో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. వాటిని కాదని ఆ గ్రూప్ సంస్థల్లో ఎవరూ నడుచుకోరు. ఆయన కూడా వాటిని మార్చేందుకు ఇష్టపడరు. ఈ రూల్స్ లో శాటిలైట్ హక్కుల కోసం కోట్లు కుమ్మరించడానికి వ్యతిరేకత కూడా ఉంటుంది. పోటీలు పడి శాటిలైట్ హక్కులు కొనుగోలు చేయడం లాంటి వాటికి ఈటీవీ చాలా దూరంగా ఉంటుంది.
ఇప్పుడు నాగార్జున మూవీ కోసం ఈ రూల్ ని బ్రేక్ చేసింది ఈటీవీ. నాగ్-రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓం నమో వెంకటేశాయ శాటిలైట్ హక్కుల కోసం ఏకంగా రూ. 12.5 కోట్లు చెల్లించి దక్కించుకోవడం.. ఆశ్చర్యం కలిగించే విషయం. నాగార్జున కెరీర్ లో ఇది హైయెస్ట్ ప్రైస్ కాగా.. ఇంత రేట్ చెల్లించేందుకు రామోజీరావు అంగీకరించారన్నదే అసలు సిసలైన షాక్.
ఇందుకు కారణం లేకపోలేదు. నాగార్జున నటించిన భక్తిరస చిత్రం అన్నమయ్యకు ఇప్పటికీ టీవీల్లో బోలెడంత టీఆర్పీ వస్తుంది. ఈ కాంబినేషన్ పై ఉన్న అఖండ విశ్వాసంతోనే ఏకంగా ఓం నమోవెంకటేశాయ చిత్రానికి పన్నెండున్నర కోట్లు చెల్లించేందుకు రామోజీరావు అంగీకరించారని చెప్పుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/