రిలీజ్ కి ముందు 'గాడ్ ఫాదర్' ప్రచారం విషయంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతోన్న యూనిట్ సరిగ్గా ప్రచార కారక్రమాలు నిర్వహించలేదని... ఏ ఈవెంట్ కూడా సరైన ప్రణాళికతో నిర్వహించలేదని....ఏకంగా సినిమా టీమ్ కే మీడియా సలహాలు ఇచ్చింది. ఈ విషయంలో మీడియాపై మెగాస్టార్ చిరంజీవి రియాక్షన్ సైతం అంతే సీరియస్ గానూ కనిపించింది.
ప్రచారం ఎలా నిర్వహించాలో మీడియా వాళ్లు మాకు చెప్పాల్సిన పనిలేదని..మా సినిమా ఎలా ప్రచారం చేసుకోవాలో మాకు తెలియదా? అంటూ స్వీట్ గా రివర్స్ పంచ్ వేసేసారు. ఈ విషయంలో నెట్టింట కొంత చర్చ జరిగినప్పటికీ వాస్తవాలు గ్రహించి తగ్గాల్సిన వాళ్లు వెనక్కి తగ్గడంతో వ్యవహారమంత సీరియస్ కాలేదు. తదుపరి ఇలాంటి సమస్యలతు తలెత్తకుండా వాల్తేరు వీరయ్య ముందుగానే అలెర్ట అయ్యాడు.
ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తోన్న బాబి ప్రచారం విషయంలో లీడ్ తీసుకుని ముందుకొచ్చినట్లు ప్రచారం సాగింది. చిరు అన్ని బాధ్యతలు బాబికే అప్పగించినట్లు వినిపించింది. పీఆర్ టీమ్ ఏం చేయాలన్నా ముందుగా బాబి అనుమతి తీసుకోవాల ని...అతని ప్లానింగ్ ప్రకారమే రిలీజ్ వరకూ అన్ని జరగాలని స్ర్టిక్ట్ ఆదేశాలిచ్చినట్లు వినిపిచింది.
మరి అంతకన్నా ముందే వీరయ్య ప్రచార రంగంలోకి దూకేసారా? అంటే అవుననే చెబుతోంది తాజా సన్నివేశం. రిలీజ్ కి ఇంకా సరిగ్గా నెల రోజులు కూడా సమయం లేకపోవడంతో ముందే మేల్కోవడం మంచిదని భావించారో? ఏమో తాజాగా సోషల్ మీడియా వేదికగా వీరయ్య ప్రచారం షురూ చేసినట్లు కనిపిస్తుంది.
నిన్నటి రాత్రి మెగాస్టార్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా వాల్తేరు వీరయ్యలోని రెండవ పాట ట్యూన్‌ను లీక్ చేసారు. పాట మాత్రమే కాదు.. వాయిస్ ఓవర్‌తో కూడిన వీడియోను అప్‌లోడ్ చేశాడు. దీంతో వీరయ్య ప్రచారం చిరంజీవి లీక్ తోనే మొదలైనట్లు అభిమానులుభావిస్తున్నారు. బాబి ప్రామిస్ చేసినా..ఈసారి చిరంజీవినే డైరెక్ట్ గా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే వీరయ్య ప్రచార చిత్రాలు మెగా అభిమానుల్ని ఆకట్టుకుంటోన్న సంగతి తెలిసిందే. ఇకపై ట్రైలర్ రిలీజ్ ...ప్రీ రిలీజ్....ఇంటర్వ్యూలు అంటూ టీమ్ బిజీ కానుంది. యూరప్ షూట్ పూర్తికాగానే చిరంజీవి అండ్ కో ఆ పనుల్లోనే బిజీ కానున్నట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.