దేవిశ్రీప్రసాద్.. టాలీవుడ్ సంగీత ప్రపంచంలో ఓ రాక్ స్టార్. ఈయన పాట చేశారంటే అది ట్రెండ్ సెట్టర్ గా నిలవాల్సిందే. అంతా దేవి సంగీతానికి క్రేజ్ ఏర్పడింది. మెలోడీలైనా, ఐటమ్ సాంగ్ లైనా దేవి మార్కు కనిపిస్తుంది. దీంతో ఆయన సంగీతం అందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించినవి వున్నాయి. అంతలా దేవి మ్యూజిక్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తోంది. అయితే గత కొంత కాలంగా తమన్ రెచ్చిపోవడంతో దేవి మ్యూజిక్ మ్యాజిక్ జోరు కాస్త తగ్గింది.
`అల వైకుంఠపురములో` బ్లాక్ బస్టర్ తో ఎక్కడ విన్నా తమన్ మాట.. పాటే వినిపించడం మొదలైంది. ఏ స్టార్ హీరో సినిమా గురించి చర్చ మొదలైనా తమన్ పేరు ప్రధమంగా వినిపించడం మొదలైంది. అయితే ఆ లెక్కల్ని `పుష్ప` సరి చేసింది. ఈ సినిమాకు దేవి అందించిన సంగీతం, పాటలు ఓ రేంజ్ లో పాన్ ఇండియా వ్యాప్తంగానే కాకుండా వరల్డ్ వైడ్ గా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా `శ్రీవల్లి... సామీ సామీ... సాంగ్స్ కి క్రేజ్ పీక్స్‌కి వెళ్లిపోయింది.
దీంతో దేవి క్రేజ్ ఒక్కసారిగా పెరిగి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ భారీ పోటీ ఏర్పడింది. ఆ క్రేజ్ కి తగ్గట్టే దేవి డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ప్రస్తుతం `పుష్ప ది రూల్`కి సంగీతం అందిస్తున్న దేవి శ్రీప్రసాద్ .. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న `భవదీయుడు భగత్ సింగ్`కు సంగీతం అందించబోతున్నాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది.
త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ భారీ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. `పుష్ప`కు ముందు ఒక సినిమాకి 3 కోట్లు మాత్రమే తీసుకున్న దేవి శ్రీప్రసాద్ `భవిధీయుడు భగత్‌సింగ్` కోసం మాత్రం ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేశారని తెలిసింది.
పవన్ - దేవిలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో జల్సా, గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. ఆ ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ దేవి అడిగిన మొత్తం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డీల్ కుదరడంతో దేవి ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన ట్యూన్ లని రెడీ చేసే పనిలో బిజీ అయిపోయాడని చెబుతున్నారు. ఈ సారి గత చిత్రాలకు మించి పవన్ అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.