అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెప్పుకునే రష్మిక మందన... కేవలం కన్నడ సినిమా పరిశ్రమకే పరిమితం అవుతుంది అనుకుంటే... తెలుగు సహా హిందీ భాషల్లో కూడా క్రేజియేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. ముందుగా కన్నడ సినీ పరిశ్రమ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన తర్వాత తెలుగు నుంచి బాలీవుడ్ కి వెళ్లి అక్కడ పాగా వేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు బాలీవుడ్ లో చేసిన ఆమెకు మాత్రం అంత క్రేజీ ఏమీ తీసుకురాలేదు.
తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన వారిసు అనే సినిమా సంక్రాంతికి విడుదలైంది. దాన్నే తెలుగులో వారసుడు అనే పేరుతో రిలీజ్ చేశారు. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదైనా సినిమాకి కొంత పాజిటివ్ టాక్ రావడంతో ఆమె గాల్లో తేలిపోతుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఆమె తాను సినీ పరిశ్రమంలోకి వచ్చి ఆరేళ్లయిందని... తనకు అన్ని భాషల్లో అవకాశాలు లభించడం తన లక్ అని ఆమె చెప్పుకొచ్చింది.
తన కష్టానికి తోడు దర్శక నిర్మాతలు సహకారంతోపాటు ప్రేక్షకులు అభిమానం వాటన్నింటికీ మించి దేవుడు ఆశీస్సులు ఉండడం వల్లే తనను ఇన్ని సినిమాలు వరించాయని వాటిలో అన్ని విజయాలు సాధిస్తున్నాయని చెబుతోంది.
అలాగే తాను ఇతరుల సమయాన్ని ప్రయత్నాలను గౌరవిస్తానని చెబుతూనే.. నటిగా ప్రతి క్షణం ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉండడానికే ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది. అలాగే సాధ్యమైనంత వరకు అభిమానుల మనసులో చోటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తానని తెలిపింది.
చివరి నిమిషం వరకు చేస్తూనే ఉంటానని ఆమె కామెంట్ చేసింది. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా తనకు అవకాశం ఇచ్చి హీరోయిన్ గా లాంచ్ చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు కూడా గుర్తు లేనట్లుగా రష్మిక చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆమెను ఏకంగా కర్ణాటక నుంచి బ్యాన్ చేయాలి అనే డిమాండ్ వరకు తీసుకువెళ్లాయి.
మనకు ఒక దారి చూపించి నిలబడే అవకాశం ఇచ్చిన వారిని మర్చిపోవడం ఏ మాత్రం కరెక్ట్ కాదని చెప్పాలి. ఎందుకంటే ఆమె చెబుతున్న లక్కు, క్రేజ్ ఇవాళ ఉండవచ్చు లేకపోవచ్చు కానీ చివరి వరకు నిలబెట్టేది క్యారెక్టర్ మాత్రమే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.