డ‌బుల్ డిజాస్ట‌ర్ డైరెక్ట‌ర్ కూడా పాన్ ఇండియా అంటున్నాడు!

Update: 2022-08-26 06:30 GMT
రాజ‌మౌళి కార‌ణంగా తెలుగు సినిమా మార్కెట్ రికార్డు స్థాయిలో పెరిగింది. ఏ చిన్ని సినిమా చేసినా నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ పరంగా భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంటున్నారు. దీంతో ప్ర‌తీ ఒక్క‌రూ పాన్ ఇండియా అనే స్తూ సినిమాలు చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే డిజాస్ట‌ర్ లు, డబుల్ డిజాస్ట‌ర్ లు అందించిన వాళ్లు కూడా ఇప్ప‌డు పాన్ ఇండియా మూవీ అంటూ ఐదు భాష‌ల్లో సినిమాల‌ని రిలీజ్ చేస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు.

ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ కూడా ఇప్ప‌డు పాన్ ఇండియా జ‌పం చేస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. గ‌తంలో త‌మిళంలో విష్ణు విశాల్ న‌టించిన 'రాక్ష‌స‌న్‌' మూవీని తెలుగులో బెల్లంకొండ శ్రీ‌నివాస్ హీరోగా 'రాక్ష‌సుడు' పేరుతో రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ మూవీని త‌మిళ మాతృక కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా తెర‌కెక్కించి దర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ మంచి మార్కులు కొట్టేశారు. ఈ సినిమా సూప‌ర్ హిట్ తో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌ని డైరెక్ట్ చేసే అవ‌కాశాన్ని సొంతం చేసుకున్నాడు.

'ఖిలాడీ' పేరుతో తెర‌కెక్కిన ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోగా డ‌బుల్ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇదిలా వుంటే 'రాక్ష‌సుడు' మూవీకి సీక్వెల్ ని చేయ‌బోతున్నానంటూ ప్ర‌క‌టించిన ర‌మేష్ వ‌ర్మ తాజాగా ఆ ప్రాజెక్ట్ ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించాడు.

'హూ' పేరుతో ఈ మూవీని తెర‌కెక్కించ‌బోతున్నారు. 'ట్ర‌స్ట్ నో వ‌న్' అని ట్యాగ్ లైన్‌. పూజా ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై బాలీవుడ్ మేక‌ర్స్ వాషూ భ‌గ్నాని, జక్కీ భ‌గ్నాని, దీప్షిక దేశ్ ముఖ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమాతో ర‌మేష్ వ‌ర్మ బాలీవుడ్ కు ప‌రిచ‌యం కాబోతున్నాడు. థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంద‌నున్న ఈ మూవీకి దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్ర‌ఫీ ఆర్‌. ర‌త్న‌వేలు. ఈ ప్రాజెక్ట్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ ప్ర‌క‌టించారు.

పూజా ఎంట‌ర్ టైన్ మెంట్ , దేవి శ్రీ‌ప్ర‌సాద్ లో క‌లిసి ప‌ని చేయ‌డానికి చాలా ఎగ్జైటెడ్ గా వున్నాను. 'హూ' పాన్ ఇండియా వైడ్ గా ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది' అని వెల్ల‌డిస్తూ ఓ వీడియోని షేర్ చేశాడు. ఈ మూవీలో న‌టించే కీల‌క న‌టీన‌టుల వివ‌రాల్ని మేక‌ర్స్ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నార‌ని తెలిసింది.

Full View

Tags:    

Similar News