రెమ్యునరేషన్ నుండి స్క్రిప్టింగ్ వరకు అనేక సమస్యల కారణంగా అక్షయ్ కుమార్ క్రేజీ ఫ్రాంఛైజీ హేరాఫేరి 2 నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఖిలాడీ స్వయంగా ఈ నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పటి నుండి గత కొన్ని రోజులుగా 'హేరా ఫేరి 3' మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తోంది. నిజానికి 'భూల్ భూలయ్యా 2' విజయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఫిరోజ్ నదియాడ్ వాలా కార్తీక్ ఆర్యన్ ని - అనీస్ బాజ్మీని హేరా ఫేరీ 3 ప్రాజెక్టులో చేర్చుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నారని కథనాలొచ్చాయి. అయితే తాజా సమాచారం మేరకు.. అనీస్ బజ్మీ ఈ మూవీకి నో చెప్పారని తెలిసింది. ఇతర సినిమాల షెడ్యూళ్లతో క్లాష్ దీనికి కారణం.
ముంబై మీడియా సమాచారం ప్రకారం.. అనీస్ తదుపరి షాహిద్ కపూర్ తో ఒక భారీ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.. దాని తర్వాత ఒక 'సూపర్ హీరో కామెడీ'ని తెరకెక్కించాల్సి ఉంటుంది. కార్తీక్ - ఫిరోజ్ ఇద్దరూ అనీస్ కోసం చాలా ఆసక్తిగా వేచి ఉన్నారు. కానీ అనేక రౌండ్ల చర్చల తర్వాత దర్శకుని తేదీలు సరిపోలలేదు.
ఇతర ప్రాజెక్టులకు కమిటవ్వడంతో అనీష్ కి వీలు పడడం లేదని తెలిసింది. అనీస్ ఇకపై హేరా ఫేరి 3కి దర్శకత్వం వహించడం లేదు. అతడు కార్తీక్- ఫిరోజ్ ఇద్దరికీ అదే విషయాన్ని తెలియజేసాడు. 'హేరా ఫేరి 3' నిజానికి అతడికి సరైన ఆప్షన్.. కానీ తప్పదు.. తేదీల సమస్య. కార్తీక్- సునీల్ శెట్టి - పరేష్ రావల్ పోషించిన మూడు ప్రధాన పాత్రలకు తనదైన టింజ్ యూనిక్ నెస్ ని తీసుకురావడానికి అతడు చాలా ఆసక్తిగా ఉన్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచిన చందంగా అయ్యింది.
అనీస్ బజ్మీ హేరా ఫేరి 3 కి పని చేయకపోయినా త్వరలో కార్తీక్ ఆర్యన్ తో మళ్లీ కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నాడు. త్వరలో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నారు. అనీస్ ముందస్తు కమిట్ మెంట్ లు లేకపోతే 'హేరా ఫేరీ3' కూడా సాధ్యమయ్యేది. ఒకవేళ కార్తీక్ తో అనీష్ పునఃకలయిక భూల్ భూలయ్యా 3తో వీలుపడే ఛాన్సుంటుందని తెలిసింది.
ఫిరోజ్ - కార్తీక్ ప్రస్తుతం 'హేరా ఫేరి 3' కోసం రాజ్ శాండిల్యతో మాట్లాడుతున్నారు. ఈ చర్చలు ఫలవంతమైతే 'డ్రీమ్ గర్ల్ 2' తర్వాత రాజ్ శాండిల్యకు మరో చక్కని సదవకాశంగా భావించాలి. హేరా ఫేరి 3 ప్రపంచాన్ని ముందుకు నడిపించేందుకు రాజ్ బాగా సరిపోతాడని భావిస్తున్నారు. మునుముందు ఈ ఎంపిక ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ఈ భారీ క్రేజీ ఫ్రాంచైజీలోని ఇద్దరు అనుభవజ్ఞులైన నటులు సునీల్ శెట్టి - పరేష్ రావల్ లతో కలిసి కార్తీక్ మూడో భాగం కోసం బరిలో దిగడం ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.