అమ‌ల సింప్లిసిటీకి అంతా షాక్!

Update: 2022-08-30 12:30 GMT
సీనియ‌ర్ న‌టి..నాగార్జున స‌తీమ‌ణి అక్కినేని అమ‌ల కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు అన్ని భాష‌ల్లోనూ అమ‌ల సినిమాలు చేసారు. త‌మిళం..క‌న్న‌డం..తెలుగు..హిందీ భాష‌ల్లో న‌టించి న‌టిగా త‌న‌కంటూ ప్రత్యేక స్థానం ఏర్ప‌రుచుకున్నారు. నాగార్జున‌తో వివాహం త‌ర్వాత అమ‌ల పూర్తిగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు.

అయినా అప్పుడ‌ప్పుడు త‌న ఫ్యాష‌న్ ని చాటుకుంటూనే ఉన్నారు. భాష‌తో సంబంధం లేకుండా మంచి రోల్ వ‌స్తే న‌టిస్తున్నారు. తాజాగా యంగ్ హీరో శర్వానంద్ క‌థానాయకుడిగా  న‌టిస్తోన్న  'ఒకే ఒక జీవితం'  లో అమల ఓ  కీలక పాత్ర పోషిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా యూనిట్ ప్ర‌చారం ప‌నులు షురూ చేసింది.

అమల మీడియాతో ఇంటరాక్ట్  విధానం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. ఆమె వినయం ..సరళత ప్రతి ఒక్కరినీ ఆక‌ట్టుకుంది.  ప్ర‌చారంలో ఎంతో నిరాడంబ‌రంగా పాల్గొన్నారు. దానికి త‌గ్గ‌ట్టే  నిర్వాహ‌కులు న‌డుచుకున్న‌ట్లు క‌నిపిస్తుంది.  సాధారణంగా అమల స్థాయి ఉన్న సీనియర్ నటీమణులు ప్రమోట్ చేయడానికి ముందుకు వస్తే చాలా హంగామా ఉంటుంది. అస‌లోళ్లు చేయ‌క‌పోయి నా?  కొస‌రోళ్లు చేస్తుంటారు. అయితే ఇక్క‌డ అమ‌ల ఎవ‌రికీ ఆ ఛాన్స్ ఇవ్వ‌లేదు. అన్ని విష‌యాల్లోనూ ఆమె లీడ్ తీసుకున్నారు.

 సాధార‌ణంగా సెల‌బ్రిటీ వెంట  సిబ్బంది.. మేకప్ ఆర్టిస్టులు మరియు సహాయకులు వెంట‌ వస్తారు. కానీ అమల విషయంలో అలా జరగలేదు. చాలా  సింపుల్ గా ఎవ‌రూ లేకుండానే   అన్నపూర్ణ స్టూడియోస్ బాల్‌రూమ్‌లో ఇంట‌రాక్ష‌న్ ముగించారామె. అమల ఎంతో  అనుభవజ్ఞురాలు.  అన్న‌పూర్ణ‌ స్టూడియోస్ యొక్క సహ-యజమాని. అయినా ఇసుమొత్తు గ‌ర్వం ఏ కోసాన క‌నిపించ‌లేదు.

అమల ఎంత‌  ప్రశాంతంగా ఉంటారో అర్ధ‌మైంది.  ఆమె  డౌన్ టు ఎర్త్ ప‌ద్ద‌తి అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఆమె సింపుల్ సిటీ కి  మీడియా సిబ్బంది సైతం విస్మయానికి గురైంది. ఆమె స్వయంగా వేదిక వద్దకు వ‌చ్చారు. తన స్వంత మేకప్ కిట్‌ను..వాట‌ర్ బాటిల్ ని  తానే తెచ్చుకున్నారు. ఎలాంటి ఆర్భాటాల‌కు..హ‌డావుడికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వ‌లేదు. చుట్టు ప‌క్క‌ల వారిని సైతం అంతే బ్యాలెన్స్ చేసారు.  అలాగే మీడియా ప్రశ్నలకు అమల ఎంతో చక్క‌గా స‌మాధానాలిచ్చారు.

స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూలు సైతం ఎంతో ఓపిక‌గా ఇచ్చారు. ఆమె సింప్లిసిటీ అందరినీ  ఆకట్టుకుంది. అమ‌ల మీడియాలో క‌నిపించ‌డం చాలా రేర్. సామాజిక  కార్య‌క్రమాల్లో పాల్గొనే స‌మ‌యంలోనే ఆమె మీడియా మీట్స్ కి హాజ‌ర‌వుతుంటారు. మిగ‌తా స‌మాయాల్లో ఆమె ఎక్క‌డా క‌నిపించ‌రు. అప్పుడ‌ప్పుడు ఇలా సినిమా ఇంట‌ర్వ్యూల్లో ద‌ర్శ‌న‌మిస్తుంటారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News