సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతేడాది లాక్ డౌన్ టైంలో 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత సినిమా మహేష్ తోనే ఉంటుందని జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఈ కాంబోలో సినిమా ప్రకటన రాగానే అభిమానులందరూ ఖుషీ అయ్యారు. అదే సమయంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి రోజుకో రూమర్ వినిపిస్తూనే ఉంది. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. మహేష్ కోసం ఓ జంగిల్ బేస్డ్ అడ్వెంచర్ స్టోరీ లైన్ అనుకుంటున్నారని.. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని చెప్పినట్లు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. అయితే తాజాగా నిర్మాత కేఎల్ నారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవన్నీ ఊహాగానాలే అని కొట్టిపారేశారు.
''మహేష్ బాబు - రాజమౌళి కాంబోలో రాబోతున్న సినిమాకి బయట మీకు వినిపిస్తున్న వార్తలకి ఎటువంటి సంబంధం లేదు. అవన్నీ ఊహాగానాలు. నిజంగా చెప్పాలంటే సబ్జెక్ట్ ఏంటి.. ఎక్కడ చేస్తున్నాం అనేది నాకే తెలియదు. ఇంక మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది'' అని నిర్మాత కేఎల్ నారాయణ తెలిపారు. రాజమౌళి స్టోరీ లైన్ మీద వర్క్ చేస్తున్నారని.. కాకపోతే ప్రస్తుతం ఆయన దృష్టంతా 'ఆర్.ఆర్.ఆర్' సినిమాపై ఉందని నిర్మాత పేర్కొన్నారు. మహేష్ బాబు తో ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నామని.. ఓ స్క్రిప్ట్ మీద 6 - 9 నెలలు వర్క్ చేసిన తర్వాత అది కరెక్ట్ గా రాకపోవడంతో విరమించుకున్నామని నారాయణ చెప్పారు.
''అదే సమయంలో మహేష్ - రాజమౌళి కాంబినేషన్లో చేస్తే బాగుంటుందని అనుకున్నాను. మహేష్ - రాజమౌళి కాంబో అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. నా మైండ్ లో ఎప్పుడూ వాళ్ళిద్దతో చేయాలనేది ఉండేది'' అని నిర్మాత చెప్పుకొచ్చారు. మహేష్ - రాజమౌళి లతో సినిమా గురించి ఏడేళ్ల క్రితమే డిస్కషన్ జరిగిందని.. ఇన్నేళ్ల తర్వాత కూడా తనతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించినందుకు వాళ్లకు రుణ పడి ఉంటానని కేఎల్ నారాయణ చెప్పారు. కరోనా వల్ల 'ఆర్.ఆర్.ఆర్' డిలే కాకుండా ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్ళేదని.. 'ఆర్.ఆర్.ఆర్' పూర్తైన తర్వాతే మహేష్ తో రాజమౌళి సినిమా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి ఎప్పుడంటే అప్పుడు మహేష్ సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడని నారాయణ తెలిపారు.