'గమ్యం' చూసిన తర్వాత ఈవీవీ రియాక్షన్

Update: 2019-02-18 04:16 GMT
అల్లరి సినీ కెరీర్ లో ఎప్పటికి గుర్తు ఉండిపోయే సినిమా "గమ్యం". క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో మెయిన్ హీరోగా శర్వానంద్ చేశాడు. అయితే శర్వానంద్ కంటే కూడా అధికంగా అల్లరి నరేష్ కు పేరు వచ్చింది. ఆ సినిమాలో అల్లరోడు పోషించిన గాలి శీను పాత్రను ప్రేక్షకులు ఇంకా కూడా గుర్తు ఉంచుకున్నారు. అప్పటి వరకు అల్లరి పాత్రలు, కామెడీ పాత్రలు చేసిన నరేష్ ఆ సినిమాలో సీరియస్ గా కొన్ని సీన్స్ లో నటించి సినిమాకే హైలైట్ గా నిలిచాడు. ఆ సమయంలో అల్లరి నరేష్ ఆ పాత్ర చేయడం అంటే పెద్ద సాహసమే. ఆ సినిమా చూసిన ఈవీవీ గారు కూడా కొడుకును మెచ్చుకోకుండా ఉండలేక పోయారట.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ మాట్లాడుతూ గమ్యం సినిమా సంగతులను గుర్తు చేసుకున్నారు. గమ్యంలో గాలి శీను పాత్రను చేస్తున్నట్లుగా నాన్నగారికి చెప్పలేదు. సినిమా గురించి తెలుసు కానీ పాత్ర గురించి చెప్పలేదు. సినిమా పూర్తి అయిన తర్వాత నాన్న కోసం ప్రత్యేక  ప్రీమియర్ వేశాము. సినిమా అంతా చూసిన తర్వాత నన్ను కారు ఎక్కించుకుని కొంత దూరం వెళ్లిన తర్వాత నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా, ముందుగా ఇలాంటి పాత్ర చేస్తున్నాను అంటే కచ్చితంగా ఒప్పుకునే వాడిని కాదు అన్నారు. నాకు ముందే ఈ పాత్ర గురించి చెప్పకుండా మంచి పని చేశావ్ అంటూ అభినందించాడట.

గాలి శీను పాత్ర  తో నవ్వించడమే కాకుండా అల్లరి నరేష్ ఎడిపించాడు కూడా, ఆ సినిమా తర్వాత అల్లరి నరేష్ క్రేజ్ మరింతగా పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం అల్లరి నరేష్ కు టైం కలిసి రావడం లేదు. దాంతో హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తున్నాడు. మహేష్ బాబు 25వ సినిమా మహర్షిలో నరేష్ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. హీరోగా అల్లరోడు మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు.
Tags:    

Similar News