ట్విట్టర్ వేదికగా 'ఈవివి' తెలుగు స్పేస్.. హాజరుకానున్న అగ్రదర్శకులు!

Update: 2021-06-09 14:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అనిపించుకున్న దర్శకులు తక్కువగా కనిపిస్తారు. అలాంటి వారిలో గొప్ప దర్శకుడు అనిపించుకుని ఎంతోమంది నూతన దర్శకులకు ఆదర్శముగా నిలిచిన దర్శకుడు ఈవివి సత్యనారాయణ. తక్కువ వయసులోనే అనంతలోకాలకు వెళ్లిపోవడం ఇండస్ట్రీకి ఇప్పటికి తీరని లోటుగానే భావిస్తుంది తెలుగు ఇండస్ట్రీ. జంధ్యాల తరం తర్వాత తెలుగులో కామెడీ సినిమాలతో అలరించిన దర్శకుడు ఎవరంటే ఈవివి పేరు ప్రథమంగా వినిపిస్తుంది. అయితే ఇప్పటికి ఆయన లోకం విడిచి పదేళ్లు గడిచినా తెలుగు సినిమాల్లో ఆయన కామెడీ మార్క్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది.

ఈ తరం దర్శకులు ఈవివి సినిమాలతోనే స్ఫూర్తి పొంది కామెడీని తెరకేక్కిస్తున్నారు. అసలు ఈవివి సినిమా అంటే ఎంతోమంది కమెడియన్లకు చేతినిండా పని ఉండేది. ఆ విధంగా మినిమం ఆయన సినిమాలో 20మంది కమెడియన్స్ నటించేవారు. అలా ప్రతి సినిమాతో వందల మందికి ఉపాధి కల్పించిన ఈవివి గారు నేడు లేని లోటును సీనియర్ కమెడియన్స్ చూస్తూనే ఉన్నారు. ఈవివి సినిమా అంటే కామెడీ మినిమం గ్యారంటీ అనిపించుకున్నారు. అయితే ఈ నెల అంటే జూన్ 10న ఈవివి 66వ జయంతి. ఆయన జయంతి సందర్బంగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు ప్రత్యేకంగా ఆయనను గుర్తు చేస్తూ ఓ కార్యక్రమం నిర్వహించడానికి రెడీ అయిపోయారు.

ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ వేదికగా ట్రెండ్ అవుతున్నటువంటి స్పేసెస్‌ లో ఈవీవీ కాన్సెప్ట్‌ నిర్వహించనున్నారు టాలీవుడ్ సెల‌బ్రెటీలు. #Evvteluguspace పేరుతో బుధ‌వారం రాత్రి 9గంటల‌ నుంచి ఈ స్పేస్ ప్రారంభం కాబోతుంది. ఈ స్పేస్ లో ఈవివి తనయుడు అల్ల‌రి న‌రేష్‌ తో పాటుగా టాలీవుడ్ దర్శకులు హ‌రీష్ శంక‌ర్ - అనిల్ రావిపూడి - మారుతి - గోపీచంద్ మ‌లినేని - క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల‌ - బీవీఎస్ ర‌వి - లిరిసిస్ట్ భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్ త‌దిత‌రులు హాజరు కాబోతున్నారు. అయితే వీరితో పాటు చాలామంది ఈవివి సినిమాలను చూసి స్ఫూర్తి పొందినవారు కోకొల్లలు. ఆసక్తి కలిగిస్తున్న ఈ స్పేస్ ప్రోగ్రాంలో ఈవివి గురించి ప్రతి ఒక్కరూ తమ అనుభవాలు షేర్ చేసుకుంటారు. కాబట్టి అందరూ ఈవివి స్పేస్ ఫాలో అవ్వాల్సిందిగా సెలబ్రిటిలు పిలుపునిచ్చారు.
Tags:    

Similar News