హిందీ నటి - బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోఫియా హయత్ పై తాజాగా లండన్ లో ఒక వ్యక్తి దాడి చేశాడు. మొహంపై పిడి గుద్దులు గుద్దడంతో పాటు - ఆమెను తీవ్రంగా గాయపర్చాడు. ఈ విషయాన్ని సోఫియా హయత్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. దాడి చేసిన వ్యక్తిని లండన్ పోలీసులు కొన్ని గంటల వ్యవదిలోనే పట్టుకున్నారు. ఒక మహిళలకు సాయం చేసేందుకు వెళ్లగా సోఫియాకు ఈ దాడి ఎదురైనట్లుగా తొస్తోంది.
తనపై జరిగిన దాడి గురించి సోఫియా హయత్ తెలియజేస్తూ... తాను పార్క్ లో నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకు కాస్త దూరంలో ఒక వ్యక్తి మహిళను వేదిస్తున్నాడు. ఆమెను ఆ వ్యక్తి కొడుతుండటంతో తాను చూస్తూ ఊరుకోలేక పోయాను. అక్కడకు వెళ్లి ఆమెను కాపాడే ప్రయత్నం చేశాడు. అతడిని పక్కకు తోసేసి ఆమెను కాపాడాను. ఆసమయంలోనే అతడు నన్ను టార్గెట్ చేశాడు. నా మొహంపై గుద్దడంతో పాటు నన్ను చేతులు కాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు.
నేను అతడిని బలవంతంగా కింద పడేసి వెంటనే పోలీసులను పిలిచాను. దాంతో అతడు అక్కడి నుండి పారిపోయాడు. ఆ వ్యక్తి పారిపోయినా కూడా కొద్ది సేపట్లోనే పోలీసులు అతడిని పట్టుకుని జైల్లో వేశారు. నాకు గాయాలు అయినా కూడా ఆ మహిళను కాపాడినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. సోఫియాకు మొహంపై పెద్ద గాయం అయ్యింది. చేయి మరియు కాళుకు చిన్న చిన్న గాయాలు అయ్యాయి. సోఫియా ధైర్యంకు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు.