'ఆర్.ఆర్.ఆర్' కు ఓవర్ సీస్ లో ఇబ్బందులు తప్పవా..?

Update: 2021-03-04 03:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ - మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిక్షనల్‌ పీరియాడిక్‌ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొమురం భీమ్‌ గా తారక్.. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌ నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ స్టార్స్ అజయ్‌ దేవగణ్‌ - ఆలియా భట్‌ - నేషనల్ అవార్డ్ గ్రహీత సముద్రఖని - శ్రీయా శరణ్ - హాలీవుడ్‌ సస్టార్స్ ఒలివియా మోరిస్‌ - రే స్టీవెన్‌ సన్ - అలిసన్‌ డూడీ తదితరులు ఇతర ప్రధాన ప్రాతల్లో నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి సినీ వర్గాల్లో ఆసక్తికరమైన డిస్కషన్ జరుగుతోంది.

'బాహుబలి' సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో 'ఆర్.ఆర్.ఆర్'కు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఓవర్ సీస్ విషయంలో మాత్రం ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఓవర్‌ సీస్‌ రైట్స్ సొంతం చేసుకున్న బయ్యర్లకు మరియు యూఎస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థకు మధ్య సంబంధాలు సరిగా లేవనే ప్రచారం జరుగుతోంది. వీరి మధ్య గొడవల కారణంగా లీగల్‌ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇదే కనుక నిజమైతే దీనిపై 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇకపోతే 'ఆర్.ఆర్.ఆర్' సినిమాని దసరాకు రిలీజ్ చేస్తుండటం పట్ల ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ గుర్రుగా ఉన్నారు. తాను నిర్మించిన 'మైదానం' సినిమాకి పోటీగా ట్రిపుల్ ఆర్ ని విడుదల చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ.. రాజమౌళి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.




Tags:    

Similar News