ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేరిపోయారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో బన్నీ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'పుష్ప ది రైజ్' గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రికార్డుల్ని తిరగరాసింది. ఉత్తరాదిలో ఎలాంటి ప్రచారం లేకుండానే భారీ వసూళ్లని రాబట్టి బాలీవుడ్ సినీ జనాలకు చుక్కలు చూపించింది.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి బన్నీని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన ఈ మూవీకి త్వరలో సీక్వెల్ ని చేయబోతున్న విషయం తెలిసిందే. 'పుష్ప ది రూల్' పేరుతో పార్ట్ 2 జూన్ లో సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇందు కోసం స్క్రిప్ట్ ఫైనల్ చేయడం కోసం దర్శకుడు సుకుమార్ యుఎస్ కు వెళ్లారు. అక్కడే తుదిమెరుగులు దిద్దుతున్నారు. వన్స్ స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్ లాక్ కాగానే సుకుమార్ హైదరాబాద్ తిరిగి రానున్నారట. వచ్చాక బన్నీతో చర్చించి ఫైనల్ కన్‌క్లూజన్ కి వచ్చాక జూన్ నుంచి 'పుష్ప 2' షూటింగ్ ప్రారభిస్తారని తెలుస్తోంది.
ఇదిలా వుంటే బన్నీ - కొరటాల శివ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఎక్సక్లూజివ్ న్యూస్ తెలిసింది. 'పుష్ప' రెండు భాగాలుగా చేయాలని టీమ్ ముందు అనుకోలేదు. తరువాతే ఆలోచన టు పార్ట్స్ కి మారింది. ఇలా మారడానికి ముందు కొరటాల శివతో బన్నీ తన 21వ ప్రాజెక్ట్ ని 2020 జూలై 31న మధ్యాహ్నం 1:00 గంటలకు సోషల్ మీడియా ట్వట్టర్ వేదికగా ప్రకటించారు. 'కొరటాల శివ గారిలో నా తదుపరి ప్రాజెక్ట్ #AA21 ని ప్రకటించినందుకు చాలా ఆనందంగా వుంది. దీని కోసం కొంత కాలంగా నిశ్శబ్దంగా ఎదురుచూస్తున్నాను. సుధాకర్ గారి మొదటి వెంచర్ కి నా శుభాకాంక్షలు. శాండీ, స్వాతి, నుట్టి మీ పట్ల నా ప్రేమను ఈ సినిమాతో చూపించుకుంటున్నాను' అని ట్వీట్ చేస్తూ పోస్టర్ ని అభిమానులతో పంచుకున్నారు.
2022 ప్రధమార్థంలో ఇది మొదలవుతుందని ఓ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. బ్లాక్ కలర్ థీమ్ లో సముద్రపు ఒడ్డున స్నేహితుడి పక్కన నిలబడి బన్నీ మాట్లాడుతున్నట్టుగా స్టిల్ లో చూపించారు. తెడ్డు సహాయంతో నడిచే తొట్టె లాంటి పడవ, పక్కనే పడేసిన లాంతరు.. పోస్టర్ ఆసక్తిని రేకెత్తించింది. యువ సుధా ఆర్ట్స్, జీఏ 2 పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని సంయుక్తంగా నిర్మించాలని ప్లాన్ చేశాయి. అయితే 'పుష్ప' ప్లాన్ మారి టు పార్ట్స్ గా మారడంతో కొరటాల ప్రాజెక్ట్ కొంత వెనక్కువెళ్లింది. దాని స్థానంలో ఆయన ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టారు.
ఇదిలా వుంటే బన్నీ - కొరటాల శివ మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ వార్త తాజాగా బయటికి వచ్చింది. 80వ దశకం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని, రాడికల్ స్టూడెంట్ గా రెబల్ పాత్రలో బన్నీ పవర్ ఫుల్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారని తెలిసింది. అంతే కాకుండా రెబల్ రాడికల్ లీడర్ అయిన హీరో జాతీయ రాజకీయాలని ఎలా ప్రభావితం చేశాడు? ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టాడన్నదే ఈ చిత్ర ప్రధాన కథగా తెలిసింది.
పవర్ ఫుల్ స్టోరీ కాబట్టే బన్నీ తో సినిమాకు ఏ మాత్రం తొందర లేదని చాలా కూల్ గా చేసుకుంటామని ఇటీవల 'ఆచార్య' ప్రమోషన్స్ లో చాలా ధీమాగా చెప్పడం విశేషం. ఈ ప్రాజెక్ట్ బన్నీ 'పుష్ప 2' పూర్తి చేయాలి, కొరటాల ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తరువాతే సెట్స్ పైకి వెళ్లే అవకాశం వుందని ఇన్ సైడ్ టాక్.