అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ థియేటర్లలోకి రిలీజైంది. తొలిరోజు వసూళ్లు అదరగొట్టేసింది. ఈ సినిమా మొదటి రోజు దాదాపు 10 కోట్లు వసూలు చేసిందని రిపోర్ట్ వచ్చినా .. ఆ తర్వాత మాత్రం డివైడ్ టాక్ తో ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోయిందని చెబుతున్నారు. మొదటి రోజు సాగించిన హవా మూడో రోజుకి తగ్గిపోయిందని ట్రేడ్ ఎనలిస్టులు చెబుతున్నారు. ఈ సినిమా ఏపీ, తెలంగాణ కలుపుకుని కేవలం రూ.18 నుంచి రూ.20 కోట్లు మధ్య మాత్రమే ఫుల్ రన్ లో 'షేర్' వసూలు చేయగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అయితే ఎవరి అంచనాలు ఎలా ఉన్నా.. అఖిల్ మొదటి సినిమాతోనే స్టార్ హీరోలతో పోటీపడే ఛరిష్మా - ట్యాలెంటు ఉన్న హీరో అని ప్రూవైంది. డ్యాన్సులు - ఫైట్స్ - కమర్షియల్ ఇంగ్రీడియెంట్ పరంగా అఖిల్‌లోని ఎనర్జీని అంత తేలిగ్గా కొట్టిపారేయలేరు ఎవరూ. అయితే ఆరంభమే ఇప్పుడున్న స్టార్ హీరోలకు మావాడేం తక్కువ కాదు అని ప్రూవ్ చేయాలనుకున్నారు నిర్మాతలు. దానికితోడు అక్కినేని కాంపౌండ్ అలాంటి ఎటెంప్ట్‌నే చేయాలని టార్గెట్ చేయడం అఖిల్‌కి ముప్పు తెచ్చిందని విశ్లేషిస్తున్నారు. కనీసం రెండు - మూడు సినిమాల తర్వాత ఆ స్థాయి కోసం ఆలోచిస్తే బావుండేదని సెటైర్లు పడుతున్నాయి. అయితే విమర్శకులు ఇలా అంటున్నా.. ఒకవేళ అఖిల్ పెద్ద సక్సెస్ అయ్యి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదే! ఇప్పుడిలా తెగిడిన నోళ్లే అప్పుడు పొగిడేవి కదూ!