ఒకప్పుడు సూపర్ స్టార్. ఇప్పుడైతే ఆ బిరుదు మాత్రమే మిగిలింది రజనీకాంత్ కి. తను చేస్తున్న సినిమాలు ఓపెనింగ్స్ లో అయితే దుమ్ముదులుపుతున్నాయి కానీ సాలిడ్ గా బాక్సాఫీస్ వద్ద నిలిచే సినిమాను మాత్రం చేయలేకపోతున్నాడు. చివరికి ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా 2.O సినిమా చేసినా ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే వచ్చింది. బాహుబలి-2 రేంజ్ ను అందుకోలేకపోయింది అది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరో సినిమా రెడీ చేశాడు రజనీకాంత్. అదే పెట్టా. తెలుగులో ఈ సినిమాకు పేట అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈరోజు ట్రయిలర్ కూడా విడుదల చేశారు. ఈ ట్రయిలర్ చూస్తే జనాల్లో మరోసారి పాత రజనీకాంత్ గుర్తొచ్చాడు. అదే స్పీడ్ - అదే ఉత్సాహం - అదే స్మైయిల్ - అదే మేనరిజమ్స్. యాజ్ ఇటీజ్ రజనీ స్టయిల్ ను దించేసింది పేట మూవీ.
ఈ సినిమాతో రజనీకాంత్ మరోసారి తన స్థాయికి తగ్గ హిట్ కొడతాడని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ పై ఇలాంటి అంచనాలు సహజమే. ప్రతి సినిమాకు అంచనాలు ఆకాశాన్నంటుతాయి. రిజల్ట్ మాత్రం ఉసూరుమనిపిస్తుంది. పేట సినిమా ఆ జాబితాలోకి చేరకూడదనే ఆశిద్దాం. త్రిష - సిమ్రాన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకుడు. సంక్రాంతి కానుకగా ఈనెల 10న థియేటర్లలోకి వస్తోంది పేట.