పవన్ అందరినీ ఖాళీ చేయించేస్తాడట

Update: 2017-03-16 08:05 GMT
ఫిబ్రవరి నెలలో చివరి రెండు వారాలు.. మార్చిలో తొలి రెండు మూడు వారాలు సినిమాలకు కష్ట కాలమే. ఈ సమయంలో విద్యార్థులందరూ పరీక్షల హడావుడిలో ఉంటారు.. ఫ్యామిలీస్ థియేటర్లకు రావు. అందుకే కాస్త పెట్టుబడి ఎక్కువున్న సినిమాలేవీ ఈ సీజన్లో రావు. దీంతో చిన్న సినిమాలు.. విడుదలకు నోచుకోకుండా ఎదురు చూస్తున్న సినిమాలు ఈ టైంలో థియేటర్లలోకి వరుస కట్టేస్తాయి. గత నాలుగు వారాల్లో దాదాపు 15 సినిమాలు థియేటర్లలోకి రావడం విశేషం. వాటిలో నిలబడ్డవి చాలా తక్కువ. ఇక ఈ శుక్రవారం కూడా ఐదారు సినిమాలు రిలీజవుతున్నాయి. వీటిలో ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమాలు తక్కువే. ఉన్న థియేటర్లను ఈ సినిమాలన్నింటికీ పంచేశారు. దీంతో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి థియేటర్లలో 10-12 సినిమాల దాకా కనిపించబోతున్నాయి.

ఐతే ఈ సినిమాలన్నింటికీ మిగిలింది ఇక వారం రోజులే. పాతవైనా.. కొత్తవైనా.. వీటి సందడికి ఇంకో వారం తర్వాత తెరపడిపోతుంది. ప్రేక్షకులు.. థియేటర్ల యాజామాన్యాలు.. క్యాంటీన్ వాళ్లు.. సైకిల్ స్టాండ్ల వాళ్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఇలా అందరి చూపూ ఇప్పుడు ‘కాటమరాయుడు’ మీదే ఉంది. ఈ సినిమా వచ్చాక కానీ.. బాక్సాఫీస్‌ లో కదలిక రాదు. వసూళ్లు లేక వెలవెలబోతున్న థియేటర్లకు ‘కాటమరాయుడు’ కళ తెస్తాడని అందరి ఆశ. ఈ చిత్రం వచ్చే సమయానికి ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఏ సినిమా కూడా ఓ మోస్తరు వసూళ్లతో ఉండే అవకాశం లేదు. కాబట్టి వీటన్నింటినీ గుంపగుత్తగా ఒకేసారి థియేటర్ల నుంచి లేపేయడం ఖాయం. ‘కాటమరాయుడు’ సినిమాతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లు నిండిపోవడం పక్కా. తొలి రోజు అయితే 95 శాతం థియేటర్లలో ‘కాటమరాయుడు’ ఉంటుందని భావిస్తున్నారు. కాబట్టి తొలి రోజు.. తొలి వారాంతంలో  ‘కాటమరాయుడు’ వసూళ్లు ఊహించని స్థాయిలో ఉండొచ్చని అంచనా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News