నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి నిర్మించిన సినిమా ‘అ’. ఆసక్తికర ప్రోమోలు.. ఆకర్షణీయమైన తారాగణంతో ఓ వర్గం ప్రేక్షకుల్లో ఈ చిత్రం బాగానే క్యూరియాసిటీ తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి బాగానే చర్చ నడిచింది. ఒక కొత్త తరహా సినిమా చూడాలనుకునేవాళ్లకు ఇది మంచి ఛాయిస్ లాగే అనిపిస్తోంది. ఐతే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు థియేటర్లకు రప్పిస్తుంది.. కమర్షియల్ గా ఏ మేరకు సక్సెస్ అవుతుందన్నదే చూడాలి. ఈ చిత్ర ప్రోమోలు వెరైటీగానే ఉన్నాయి కానీ.. వెంటనే సినిమా చూడాలనే ఉత్సుకతను కలిగించాయా అంటే సందేహమే.
కొత్తదనం పేరుతో మరీ ప్రయోగాత్మకంగా వెళ్లిపోయిన భావన కలిగించిందీ సినిమా. థియేట్రికల్ ట్రైలర్ వెరైటీగా కట్ చేశారు కానీ.. కథకు సంబంధించి ఏమీ రివీల్ చేయలేదు. మామూలుగా ట్రైలర్ అంటే ఎంతో కొంత కథ మీద అవగాహన కల్పించాలి. సినిమా చూడాలన్న ఉత్కంఠ పెంచాలి. ఆ విషయంలో ‘అ’ పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. కాస్టింగ్ పరంగా ఎంత ఆకర్షణ ఉన్నప్పటికీ.. సినిమా ఎలా ఉందన్నదే కీలకం. మరి ఈ చిత్రం జనాల్ని తొలి రోజు ఏ స్థాయిలో థియేటర్లకు రప్పిస్తుంది.. ఎలాంటి ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది అన్నది చూడాలి. ఈ వీకెండ్ కు లీడర్ అయితే ఈ సినిమానే అయ్యేలా ఉంది. ఐతే రిలీజ్ ముంగిట ప్రమోషన్లు బాగా చేసి జనాల్లో ఆసక్తి పెంచడం.. అడ్వాన్స్ బుకింగ్స్ బాగా అయ్యేలా చూడటం కీలకం. చూద్దాం నాని అండ్ టీం ఎలా ప్లాన్ చేసిందో?