2021 ముగుస్తోంది. 2022లో అడుగుపెట్టేందుకు ఇంకో ఐదురోజులే మిగిలి ఉంది. జనవరి- 1 ఉత్సవాల కోసం ప్రజలంతా ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి ఉన్నారు. కొత్త సంవత్సరం సంక్రాంతి కానుకగా వరుసగా మూడు భారీ పాన్ ఇండియా చిత్రాలు విడుదలవుతున్నాయి.
ఇకపోతే 2021 ని స్మరిస్తే ఈ ఏడాది తీపి-చేదుల కలయికగా కనిపిస్తోంది. నవతరం దర్శకుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ కొత్త ఏడాది చాలా మందికి కలిసి రానుంది. కొందరు దర్శకులు కంబ్యాక్ లో కూడా అగ్ర హీరోలతో అవకాశాలు దక్కించుకోవడం ఆశ్చర్యపరుస్తోంది.
పరిశ్రమ అగ్ర కథానాయకుడు .. మెగాస్టార్ చిరంజీవితో ముగ్గురు యువదర్శకులు అవకాశాలు అందుకోవడం నిజంగా మ్యాజిక్ అని చెప్పాలి. ఈ లాక్ డౌన్ పీరియడ్ లో కథలు చెప్పి చిరుని లాక్ చేయడంలో ఆ ముగ్గురు సఫలమయ్యారు. వీరిలో యువదర్శకుడు బాబి చిరుతో వాల్టేర్ వీరన్న చిత్రం తెరకెక్కిస్తున్నారు. అలాగే మరో యువదర్శకుడు మారుతి దాసరికి సినిమా చేస్తానని చిరు హామీనిచ్చారు. అలాగే మెహర్ రమేష్ కి భోళా శంకర్ రూపంలో కంబ్యాక్ ఆఫర్ దక్కింది. మరోవైపు వేణు ఉడుగులకు చిరు కమిటయ్యారు. దానయ్య బ్యానర్ లో చిత్రమిది. ఛలో- భీష్మ తర్వాత అగ్ర హీరోతో క్రేజీ ఆఫర్ ఇది. వేణు నిరూపించాల్సి ఉంటుంది.
ఇక నటసింహా నందమూరి బాలకృష్ణతో పని చేసే అవకాశం గోపిచంద్ మలినేని.. అనీల్ రావిపూడి వంటి వారికి కలిగింది. ఆ ఇద్దరూ ప్రీప్రొడక్షన్ పనులు ముగించిన సంగతి తెలిసిందే. అటు రవితేజతో రమేష్ వర్మ ఖిలాడీ లాంటి అవకాశం అందుకుంటే.. రామారావ్ ఆన్ డ్యూటీ చిత్రానికి మరో యువదర్శకుడు శరత్ మండవ అవకాశం దక్కించుకున్నారు.
డార్లింగ్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ -కే లాంటి భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి నాగ్ అశ్విన్ అవకాశం అందుకున్నారు. అలాగే ప్రభాస్ అటు ఓంరౌత్.. ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లకు అవకాశమిచ్చారు. వీళ్లందరి కంటే నాగ్ అశ్విన్ చేస్తున్నది విలక్షణమైన సినిమా. నిరూపించుకోవడానికి అత్యంత సవాల్ ని అతడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రాధాన్యత అంతే ఇదిగా ఉంది ఈ సినిమాకి. నానీతో `అంటే సుందరానికి` చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. మెంటల్ మదిలో- బ్రోచేవారెవరురా చిత్రాలతో విజయాలు అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ క్రేజీగా ఈ అవకాశం దక్కించుకున్నాడు. అతడు సైలెంట్ గా దూసుకెళుతున్నాడు. వెంకటేష్ తో సినిమా చేస్తున్నానని తరుణ్ భాస్కర్ చాలా కాలంగా చెబుతున్నాడు. దానికి ఇప్పుడు పని జరుగుతోంది. రామ్ చరణ్ తో పని చేయడం తన కల అని గౌతమ్ తిన్ననూరి వెల్లడించారు.
ఆ ఆఫర్ తనకు రానే వచ్చింది. శంకర్ తో సినిమా పూర్తయ్యే గ్యాప్ లోనే గౌతమ్ తో పట్టాలెక్కించేందుకు రామ్ చరణ్ రెడీ అవుతున్నారని సమాచారం. జెర్సీతో గౌతమ్ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. అటు బాలీవుడ్ లోనూ ఈ మూవీని రీమేక్ చేస్తూ ట్రెండింగ్ గా మారాడు. కింగ్ నాగార్జున- నాగచైతన్యలతో కలిసి సోగ్గాడే ఫేం కళ్యాణ్ కృష్ణకు బంగార్రాజు లాంటి క్రేజీ ఆఫర్ దక్కింది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా పూర్తవుతోంది. రెండేళ్ల డైలమా అనంతరం కళ్యాణ్ కి ఇది కంబ్యాక్ ఆఫర్ లాంటిదే. నిరూపిస్తాడనే భావిస్తున్నారు. సుధీర్ వర్మ.. చందు మొండేటి.. వేణు ఉడుగుల.. లాంటి డైరెక్టర్లు స్టార్ హీరోలతో కాకపోయినా పలు కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలతో ట్రెండీ టాక్ గా మారారు. ఇంకా హిడెన్ గా ఎందరో యువదర్శకులకు అగ్ర హీరోలతో కమిట్ మెంట్లు ఉన్నాయి. వాటికి ఒక షేప్ వచ్చాక అధికారిక ప్రకటనలు వెలువరిస్తారు.