త్వరలో ప్రభాస్ మైనపు విగ్రహం మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ లో పెట్టనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయ్. టుస్సాడ్స్ ఆర్ట్ వర్క్ టీమ్ వాళ్లు వచ్చి ప్రభాస్ కొలతలు తీసుకొన్నారు. అంతా బానే ఉంది కానీ టుస్సాడ్స్ లో ఓ మైనపు బొమ్మ ఏర్పాటు ఎంత ఖర్చుతో కూడుకొన్న శ్రమో తెలుసా? చూద్దాం పదండి.
ఎవరైనా సెలబ్రిటీ విగ్రహం ఏర్పాటు చేయాలనుకొన్న దగ్గర్నుంచి.. అది పూర్తయ్యే లోపు.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియమ్ నిర్వాహకులకి దాదాపు లక్షా 50 వేల పౌండ్స్ ఖర్చువుతాయ్. మన కరెన్సీలో చెప్పాలంటే కోటీన్నర రూపాయలు. మరి కోట్లలో ఖర్చు పెడుతూ ఎవరెవరో విగ్రహాలు ఎందుకు పెట్టడం.. ఎందుకంత సరదా అంటే వాళ్ల లెక్కలు వాళ్లకుంటాయ్. ఇక ప్రభాస్ విషయంలోనూ అంతే. అల్రెడీ కొలతలు తీసుకొన్నప్పటికీ డౌట్ వచ్చినప్పుడల్లా ఇండియాకి వచ్చిపోతూనే ఉన్నారు. ఈ ఖర్చులన్నీ మ్యూజియమ్ వాళ్లవే. నిజానికి ఇప్పటి వరకు భారత్ నుంచి చాలామంది సెలబ్రిటీల విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ లో కొలువుదీరాయ్. కాకపోతే యంగ్ రెబల్ స్టార్ స్టాట్య్చూ పెడుతున్నారనే సరికే ఆసక్తి ఎక్కువై ఆరాలు తీసే సరికి ఖర్చుల వివరాలు బయటికొచ్చాయ్ అంతే.
ఇక వచ్చే మార్చి నాటికి మేడమ్ టుస్సాడ్స్ లో ప్రభాస్ మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఏప్రిల్ లో బాహుబలి- 2 రిలీజ్ కానుంది. అంటే ప్రభాస్ అండ్ ఫ్యాన్స్ కి డబుల్ బోనాంజానే. కంటిన్యూగా సంబరాలు చేసుకోవచ్చు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/