జీవితంలో ప్ర‌తిదీ అనుభ‌వించి ఫ‌ల‌వ‌రించాలి!- విక్ట‌రీ వెంక‌టేష్‌

Update: 2021-10-20 14:34 GMT
``జీవితంలో అన్ని అనుభ‌వాల్ని అనుస‌రించండి. మంచి చెడు.. తీపి చేదు .. చీక‌టి వెలుగు .. వేస‌వి చ‌లి.. అన్ని వెరైటీల‌ను అనుభ‌వించండి. అనుభ‌వాల విష‌యంలో భ‌య‌ప‌డ‌కండి. అనుభ‌వాల‌తోనే గొప్ప‌ ప‌రిణ‌తి సాధ్య‌మ‌వుతుంది``. ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత సైకాల‌జిస్ట్ ఓషో కొటేష‌న్ ఇది. దీనిని విక్ట‌రీ వెంక‌టేష్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసారు.

రామ‌కృష్ణ ప‌ర‌మ‌హంస‌.. వివేకానందుడు స‌హా ఓషో లాంటి మ‌హా జ్ఞానులను అనుస‌రించేందుకు ఆధ్యాత్మిక చింత‌న‌ను రియాలిటీతో క‌నెక్ట్ చేసేందుకు ఇష్ట‌ప‌డే అరుదైన స్టార్ గా విక్ట‌రీ వెంక‌టేష్ సుపరిచితం. జీవితంలో ప్ర‌తిదానిని అనుభ‌వించి ఫ‌ల‌వ‌రించాల‌ని చెబుతారాయ‌న‌. క‌ష్టం సుఖం దుఃఖం ఈతి బాధలు ప్ర‌తిదీ అనుభ‌విస్తేనే క‌దా ప‌రిణ‌తి సాధించేది అనేది ఆయన ప‌రిచ‌యం చేసిన సూక్తి ఉద్ధేశం.

``అన్నీ నాకే కావాలని నెత్తిన వేసేసుకుంటాం. బ‌య‌ట బాధ‌ల‌న్నీ నెత్తిపై భారంగా మారుతుంటాయి. ముందు ఆ భారం దించుకోవాల‌ని ఇంత‌కుముందు ఓ స‌మావేశంలో వెంకీ మంచి లెస్స‌న్ చెప్పారు. అది చాలా మందికి అవ‌స‌ర‌మైన సూచ‌న‌గా భావించారు! ఇక కెరీర్ ప‌రంగానూ విక్ట‌రీ వెంక‌టేష్ ఇత‌ర హీరోల్లా అన‌వ‌స‌ర‌మైన హ‌డావుడి చేయ‌డం లేదు. తాపీగా ఏడాదికో సినిమా చేస్తూ కూల్ గా లైఫ్ జ‌ర్నీని ప్లాన్ చేస్తున్నారు. రిలాక్స్ డ్ మైండ్ తో ఉండేందుకే వెంకీ ఆస‌క్తిగా ఉన్నారు.
Tags:    

Similar News