ఎక్స్ ప్రెస్ రాజాకి బ్రేక్ లు మొదలయ్యాయి. నాన్ స్టాప్ గా దూసుకుపోగల సత్తా ఉందనే నమ్మకంతో.. ఎక్స్ ప్రెస్ రాజా మూవీని సంక్రాంతి రేస్ లో నిలబెట్టారు మేకర్స్. బాలకృష్ణ - నాగార్జున - జూనియర్ ఎన్టీఆర్ లతో పోటీ ఉన్నా.. ధైర్యంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అంచనాలకు తగ్గట్లుగానే ఎక్స్ ప్రెస్ రాజాకి తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్క్రీన్ లు లభించాయి. కానీ సమస్య ఇతర రాష్ట్రాల్లోనే వస్తోంది.
ముఖ్యంగా కర్నాటక - చెన్నైలలో రిలీజ్ చేసేందుకు కష్టం అవుతోంది. ఇప్పటికే ఎక్స్ ప్రెస్ రాజాకి చెన్నైలో బ్రేక్ పడింది. పలు తమిళ సినిమాలతోపాటు టాలీవుడ్ పెద్ద మూవీస్ కూడా ఉండడంతో.. థియేటర్స్ దొరకలేదు. ఇప్పుడీ శర్వానంద్ సినిమా కర్నాటకలో రిలీజ్ ఆగిపోతోంది. మూవీపై ఉన్న అంచనాతో రూ.35 లక్షల భారీ మొత్తం ఇచ్చేందుకు కర్నాటక డిస్ట్రిబ్యూటర్ అంగీకరించాడు. ఇదే డిస్ట్రిబ్యూటర్ సోగ్గాడే చిన్ని నాయన రైట్స్ రూ. 30 లక్షలకే తీసుకోవడం విశేషం. ప్రస్తుతం పెద్ద సినిమాల రిలీజ్ కారణంగా.. ఈ డీల్ వర్కవుట్ కాదని ఆయన భావించి, 15 లక్షలకు తగ్గించాల్సిందిగా కోరాడు.
కానీ ఎక్స్ ప్రెస్ రాజా నిర్మాతలు దీనికి అంగీకరించలేదు. దీంతో కర్నాటక రిలీజ్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పేశాడు ఆ డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు ఎక్స్ ప్రెస్ రాజా కర్నాటక లో కూడా రిలీజ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది. అయితే.. కర్నాటక, చెన్నైలలో కొంత ఆలస్యంగా రిలీజ్ చేసే అవకాశాలున్నా.. ఆ డీల్ రేట్ మాత్రం తెలుగు వెర్షన్ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుందనడంలో సందేహం అక్కర్లేదు.