సీనియర్ హీరో వెంకటేష్.. మెగా హీరో వరుణ్ తేజ్ లు మొదటిసారి కలిసి నటించిన 'ఎఫ్ 2' ట్రైలర్ తాజాగా విడుదలయింది. 2 నిముషాలకుపైగా డ్యూరేషన్ ఉన్న ఈ ట్రైలర్ లో మెజారిటీ భాగం ఎంటర్టైన్ మెంట్ పై ఫోకస్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి.
వెంకీ పెళ్ళికి జస్ట్ కొన్ని సెకన్ల ముందు పూజారి తాళి బొట్టు చేతికి అందిస్తూ "చివరిగా నవ్వుకొని తాళి కట్టు నాయనా" అనే పంచ్ ఒకటి...మరో సందర్భంలో అన్నపూర్ణ వెంకీతో "అట్టా ఏడిపించకపోతే దాని కడుపున ఒక కాయ కాయించొచ్చు కదా" అంటే దానికి సమాధానంగా "24 గంటలూ మీరు నా కొంపలో ఏడుస్తూ కూచుంటే కాయలెక్కడ కాస్తాయి.. నీ తలకాయి".. "లేడీస్ బాగా ఈజీగా నమ్మేది చాడీస్".. లాంటి పంచ్ లు బాగున్నాయి. ఇక "వెంకీ ఆసన్" కూడా ఆసక్తిని రేకెత్తించేదే. 'ఫసక్' లాగా తెలుగులో ఇది కొత్త పదంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సోసోగానే ఉంది.
వెంకటేష్ కు కామెడీ సీన్లు.. ఫ్యామిలీ తో వచ్చే సీన్లు కొట్టిన పిండి కావడంతో యాజ్ యూజువల్ గా దుమ్ము రేపాడు. ఇది కాయిన్ కు ఒకవైపైతే మరోవైపు వెంకీ ఫేస్ లో వయసు క్లియర్ గా కనిపిస్తోంది. వెంకీ - తమన్నా జోడీ చూసేందుకు పెద్దగా అందంగా లేదు. ఇక వరుణ్ తేజ్ కు ఇలాంటి కామెడి క్యారెక్టర్ కొత్త కావడంతో జస్టిస్ చేసేందుకు గట్టిగా ప్రయత్నించినట్టు అనిపిస్తోందిగానీ పెద్దగా ఎఫెక్టివ్ గా లేదు. ఇదిలా ఉంటే సంక్రాంతి అల్లుళ్ళుగా ఇద్దరూ సూట్ అయ్యారు గానీ హీరోయిన్లు ఇద్దరిలో తెలుగుదనం కనిపించడం లేదు. అల్లుళ్ళు తెలుగే గానీ కూతుళ్ళు నార్త్ భామలనే ఫీలింగ్ వస్తోంది. అక్కడక్కడా కామెడి ఫోర్స్డ్ గా ఉన్నట్టు కూడా ఉంది. మరి సినిమాలో అనిల్ రావిపూడి ఎలాంటి మ్యాజిక్ తో దీన్ని గట్టెక్కిస్తాడో వేచి చూడాలి. అంతలోపు మీరు ఈ ట్రైలర్ ను ఒక చూపు చూడాలి.. వెంకీ ఆసన్ ను కూడా నేర్చుకోవాలి!
Full View