రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' మార్చి 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి భాషలోను ఈ సినిమా విజయవిహారం చేస్తోంది.
తొలి రోజున తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, వసూళ్ల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను నమోదు చేసింది. 1000 కోట్ల మార్కును టచ్ చేసిన ఈ సినిమా, ఇంకా తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది.
ఈ సినిమా విడుదలై మే 13వ తేదీ నాటికి 50 రోజులు అవుతుంది. చాలా ప్రాంతాల్లో .. చాలా థియేటర్లలో ఈ సినిమా 50 రోజుల మైలురాయి దిశగా దూసుకుపోతోంది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో 'ఆర్ ఆర్ ఆర్' 50 రోజులను పూర్తి చేసుకోనున్నట్టు చెబుతున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' 50 రోజుల పండుగను జరుపుకునే థియేటర్స్ లో సుదర్శన్ థియేటర్ ఒకటిగా నిలవనుంది. ఆ తరువాత ఆ ప్లేస్ లోకి 'ఎఫ్ 3' సినిమా రానుంది. మే 27వ తేదీన 'ఎఫ్ 3' సినిమా భారీ స్థాయిలో విడుదలవుతుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఆయన కూడా ఇంతవరకూ ఫ్లాప్ ముఖం చూడని దర్శకుడే. ఆయన దర్శకత్వంలో గతంలో వచ్చిన 'ఎఫ్ 2' సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
తమని పట్టించుకోవడం లేదంటూ భర్తలను టార్చర్ పెట్టే భార్యల కథ ఇది. 'ఎఫ్ 3' విషయానికి వస్తే ఈ కథ డబ్బు చుట్టూ తిరుగుతుంది. భార్యలు తమ అత్యాశకి తగినట్టుగా సంపాదించమని భర్తలను టార్చర్ పెట్టడం ఈ కథలో కనిపిస్తుంది. అలా పచ్చనోట్ల వెంట పరిగెడితే ఏమౌతుందనేదే అసలు కథ.
ఈ అంశం చుట్టూనే అనిల్ రావిపూడి ఈ కథను నడిపిస్తున్నాడు. డబ్బు కోసం పడే ఆరాటం .. చేసే పోరాటం చుట్టూనే ఆయన నవ్వులు పూయించనున్నాడు. వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ సందడి చేయనున్నారు.
ఇక ఈ ఇద్దరి భామల మధ్యలో సోనాల్ చౌహాన్ గ్లామర్ మెరుపులు మెరిపించనుంది. ముఖ్యమైన పాత్రల్లో రాజేంద్రప్రసాద్ .. సునీల్ .. సంగీత .. అంజలి కనిపించనున్నారు. 'ఎఫ్ 2'కి మించిన వినోదాన్ని ఈ సినిమా పంచుతుందని అనిల్ రావిపూడి చెప్పడంతో, ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి పెరుగుతూ పోతోంది.