ఆ రెంటితో ఎఫ్‌ 3కి కష్టాలు

Update: 2022-06-05 09:27 GMT
వెంకటేష్‌.. వరుణ్‌ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిశ్రమ స్పందన దక్కించుకున్న ఎఫ్ 2 సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ లభించాయి. మొదటి వారం రోజుల్లో సినిమా సాలిడ్ గానే రాబట్టింది. అయితే బ్రేక్‌ ఈవెన్ సాధించడానికి.. లాభాల బాట పట్టడానికి రెండవ వారం మరియు మూడవ వారంలో వచ్చే కలెక్షన్స్ కీలకంగా మారాయి.

సినిమాను ఎనిమిది వారాల తర్వాత గాని ఓటీటీ లో తీసుకురామని ప్రకటించిన యూనిట్‌ సభ్యులు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో బాగానే సఫలం అయ్యారు అనుకుంటున్న సమయంలో మొన్న విడుదల అయిన మేజర్ మరియు విక్రమ్‌ సినిమా లు ఎఫ్ 3 ని దెబ్బేసినంత పని చేశాయి. ఎఫ్ 3 జోనర్ వేరే అయినా కూడా మేజర్ మరియు విక్రమ్‌ సినిమా లకు పాజిటివ్ రెస్పాన్స్ రావడం వల్ల కాస్త కలెక్షన్స్ లో తగ్గుదల కనిపించడం ఖాయం.

ఎఫ్ 3 సినిమాకు రెండవ మరియు మూడవ వారం వసూళ్లపై చాలా అంచనాలు ఉన్నాయి. మొదటి వారంలో వచ్చిన మొత్తం వసూళ్లకు సమానమైన వసూళ్లు రెండవ వారం నుండి లాంగ్ రన్ లో వస్తాయని ఆశించారు. కాని విక్రమ్‌ మరియు మేజర్ సినిమాల వల్ల వసూళ్ల పై ప్రభావం పడే అవకాశం ఉందంటూ ట్రేడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాతో పాటు అన్ని మీడియాల్లో కూడా ఎఫ్ 3 పై జోరుగా పాజిటివ్‌ ప్రచారం జరుగుతుంది. ఈ ఆదివారం వరకు ఫ్యామిలీ ఆడియన్స్‌ బాగానే వస్తారు. ఆ తర్వాత నుండి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఎఫ్ 3 కూడా భారీగా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం అందరిలో ఉంది.

ఎఫ్‌ 2 స్థాయిలో అయినా ఈ సినిమా వసూళ్లు సాధిస్తుందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఆ సినిమా దాదాపుగా 90 కోట్ల వరకు షేర్ ను దక్కించుకోగా ఈ సినిమా వంద కోట్ల షేర్ ను రాబడుతుందనే నమ్మకంతో దిల్‌ రాజు అండ్‌ టీమ్ ఉన్నారు. మరి విక్రమ్‌ మరియు మేజర్ సినిమాలు ఎంత వరకు ఎఫ్ 3 ని దెబ్బ కొడతాయి అనేది ఈ వారం పూర్తి అయ్యేప్పటికి క్లారిటీ వచ్చేను.
Tags:    

Similar News