విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `ఎఫ్ 3`. తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్ లుగా నటించారు. ఇక ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీలోని కీలక పాత్రల్లో రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, అలీ, సునీల్ కనిపించారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజె `ఎఫ్2` ఫ్రాంచైజీగా నిర్మించిన ఈ మూవీ మే 27న భారీ స్థాయిలో విడుదలై తొలి రోజు తొలి షో తోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
చాలా రోజుల తరువాత ఫ్యామిలీ మూవీ థియేటర్లకు రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం మొదలు పెట్టారు. దీంతో ఈ మూవీకి మరింత ఆదరణ మొదలైంది. మండే టెస్ట్ ని విజయవంతంగా పాస్ అయిపోయిన ఈ మూవీ విడుదలై ఆరు రోజులవుతున్నా ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్లని రాబడుతూ విజయవంతంగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది.
ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 46 కోట్లకు పైగా షేర్ ని రాబట్టింది. నిలకడగా వసూళ్లని రాబడుతూ బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుకుంటోంది. ఇదిలా వుంటే ఈ మధ్య క్రేజీ సినిమాలు థియేటర్లలో ఓ రేంజ్ లో ప్రభావాన్ని చూపిస్తుండగానే ఓటీటీల్లో సడన్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇటీవల `కేజీఎఫ్2`, ట్రిపుల్ ఆర్, తాజాగా `సర్కారు వారి పాట` ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే. ఇదే తరమాలో `ఎఫ్ 3` కూడా ఓటీటీలో నాలుగు వారాల్లోనే వస్తుందిలే అని అనుకున్నారంతా. మిగతా సినిమాల్లోగే `ఎఫ్ 3` కూడా ఫాస్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అప్పుడు ఇంట్లో వుండే చూడొచ్చులే అని ఓటీటీ ప్రేక్షకులు ఆశపడ్డారు.
అయితే అలా భావించిన వాళ్లకు `ఎఫ్ 3` టీమ్ షాకిచ్చింది. అంత ఈజీగా నాలుగు వారాల్లో ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ కి ఇవ్వడం లేదని చిత్ర బృందం గురువారం స్పష్టం చేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. ఇందులో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఎఫ్ 3 సినిమాని థియేటర్ లో చూసి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ థాంక్యూ.. అన్నారు. ఆ తరువాత వరుణ్ తేజ్ మాట్లాడుతూ `ఎఫ్ 3` ని థియేటర్లలో చూడకపోయినా నాలుగవ వారం ఓటీటీలో చూడొచ్చులే అనుకున్నారుగా అనగానే వెంకటేష్ అందుకుని `ఇట్స్ నాట్ కమింగ్ అమ్మా.. నాలుగు వారాల్లో రాదమ్మా..8 వారాల తరువాతే ఓటీటీలోకి వస్తదమ్మా` అంటూ ఓటీటీ ప్రియులకు షాకిచ్చారు.
ఉన్నట్టుండి `ఎప్ 3` టీమ్ ఓటీటీ రిలీజ్ పై స్పందించడానికి కారణం రీసెంట్ గా 3 వారాల వ్యవధిలోనే సర్కారు వారి పాట` ఓటీటీకి రావడం వల్ల భయంతో మా మూవీ అప్పుడే ఓటీటీలో రాదంటూ ప్రకటిస్తున్నారని కామెంట్ లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం `ఎఫ్ 3` ప్రదర్శిస్తున్న థియేటర్స్ ఫుల్స్ కావడం లేదట. ఆ కారణంతో ఎక్కడ ఓటీటీలో రిలీజ్ చేయమంటారోననే భయం వల్లే తాజాగా ఓటీటీ రిలీజ్ పై `ఎప్ 3` టీమ్ స్పందించారని కామెంట్ లు వినిపిస్తున్నాయి.
Full View